TDP List: తెలుగు దేశం మూడో లిస్ట్ రెడీ..!

TDP List: తెలుగు దేశం పార్టీ ప్ర‌స్తుతం పెండింగ్ సీట్ల లిస్ట్‌పై ఫోకస్ చేస్తోంది. ఇప్ప‌టికే రెండు జాబితాల్లో భాగంగా అభ్య‌ర్ధుల‌ను ప్ర‌క‌టించిన తెలుగు దేశం.. ఇప్పుడు మూడో లిస్ట్‌ని రెడీ చేసిన‌ట్లు తెలుస్తోంది. తెలుగు దేశం పార్టీ నుంచి ఇంకా 16 సీట్ల ప్ర‌క‌టన పెండింగ్‌లో ఉంది. ఇప్ప‌టికే మొద‌టి విడ‌త‌లో 94 మంది అభ్య‌ర్ధుల‌ను రెండో జాబితాలో 34 స్థానాల‌ను ప్ర‌క‌టించింది. 17 లోక్‌స‌భ స్థానాల్లో మెజారిటీ అభ్య‌ర్ధుల ఎంపిక పూర్తైంది. ఇక మూడో జాబితాలో అంద‌రినీ క‌లిపి ప్ర‌క‌టించేస్తార‌ని టాక్. అసెంబ్లీ స్థానాల కంటే ముందు ఎంపీ స్థానాల‌పై ఎక్కువ క‌స‌ర‌త్తు చేస్తున్నారు.

1999 త‌ర్వాత చంద్ర‌బాబు నాయుడు ఇంత త్వ‌ర‌గా అభ్య‌ర్ధుల‌ను ప్ర‌కటించ‌డం ఇదే తొలిసారి. సాధార‌ణంగా ఎన్నిక‌ల న‌గారా మోగాక అభ్య‌ర్ధుల‌ను ప్ర‌క‌టించేవారు. కానీ ఈసారి భారతీయ జ‌న‌తా పార్టీ, జ‌న‌సేన పార్టీల‌తో పొత్తు పెట్టుకున్న నేప‌థ్యంలో కాస్త త్వ‌ర‌గానే అభ్య‌ర్ధుల‌ను చ‌క‌చ‌కా ప్ర‌క‌టించేసారు.

ఇక మూడో జాబితాను ఒక‌సారి పరిశీలిస్తే..

ప‌లాస – గౌతు శిరీష‌, గ్రీష్మ‌

పాత‌ప‌ట్నం – క‌ల‌మ‌ట వెంక‌ట ర‌మ‌ణ‌

ఎచ్చెర్ల – కిమిడి క‌ళా వెంక‌ట్రావ్

చీపురుప‌ల్లి – గంటా శ్రీనివాస రావు, కిమిడి నాగార్జున‌

శృంగ‌వ‌ర‌పుకోట – కొల్ల ల‌లిత కుమారి

భీమిలి – కోరాడ రాజ‌బాబు, గంటా శ్రీనివాస‌రావు

కాకినాడ అర్బ‌న్ – వ‌న‌మాడి కొండ‌బాబు

పెన‌మ‌లూరు – బోడె ప్ర‌సాద్, దేవినేని ఉమ‌

మైల‌వ‌రం – వ‌సంత కృష్ణ‌ప్ర‌సాద్, బొమ్మ‌సాని వెంక‌టేశ్వర్లు

న‌ర‌సారావ‌పేట – ఆల‌పాటి రాజా, అర‌వింద‌బాబు, కోడెల శివ‌రాం

చీరాల – ఆమంచి స్వాములు, కృష్ణ‌మోహ‌న్

సర్వ‌ప‌ల్లి – సోమిరెడ్డి చంద్ర‌మోహ‌న్ రెడ్డి

గుంత‌క‌ల్లు – గుమ్మ‌నూరు జ‌య‌రాం

అనంత‌పురం – కోట్ల సుజాత‌మ్మ‌, వైకుంఠం ప్ర‌సాద్

ఆలూరు – కోట్ల సుజాత‌మ్మ‌, వైకుంఠం ప్ర‌సాద్

ద‌ర్శి – ముద్దిశెట్టి వేణుగోపాల్, శిద్ధా రాఘ‌వ‌రావు