AP Elections: గ‌తి లేదు.. క‌ల‌వాల్సిందే..!

AP Elections: ఆంధ్ర‌ప్ర‌దేశ్ ఎన్నిక‌ల్లో పోటీ చేయాలంటే భార‌తీయ జ‌న‌తా పార్టీకి (BJP) పొత్తు పెట్టుకోక త‌ప్ప‌దు. ఆల్రెడీ తెలుగు దేశం పార్టీ (TDP), జ‌న‌సేన (janasena) పొత్తులో ఉన్నాయి. నిజానికి తెలుగు దేశంతో పొత్తు ప్ర‌క‌టించ‌డానికి ముందు జ‌న‌సేన భార‌తీయ జ‌న‌తా పార్టీతోనే పొత్తు పెట్టుకుంది. ఆ త‌ర్వాత చంద్ర‌బాబు నాయుడు (chandrababu naidu) అరెస్ట్ అవ్వ‌డం.. జ‌న‌సేనాని ప‌వ‌న్ క‌ళ్యాణ్ (pawan kalyan) క‌రిగిపోయి పొత్తు పెట్టుకుంటాన‌ని హామీ ఇచ్చేయడం జ‌రిగిపోయాయి.

ఇక ఏపీలో భారతీయ జ‌న‌తా పార్టీ ఒంట‌రి అయిపోయింది. ఒంట‌రిగా పోటీ చేసే స‌త్తా అయితే లేదు. కాబ‌ట్టి న‌చ్చినా న‌చ్చ‌క‌పోయినా తెలుగు దేశం, జ‌న‌సేన‌తో క‌ల‌వాల్సిందే. ఈ నేప‌థ్యంలో నాదెండ్ల మ‌నోహ‌ర్.. BJP రాష్ట్ర అధ్య‌క్షురాలు పురంధేశ్వ‌రితో (purandeswari) భేటీ అయ్యారు. కీల‌క అంశాల‌ను చ‌ర్చించిన‌ట్లు తెలుస్తోంది. ఈ నేప‌థ్యంలో BJP కోర్ క‌మిటీ స‌మావేశం ఏర్పాటుచేసింది. జ‌న‌సేన‌, తెలుగు దేశం పార్టీల‌తో పొత్తు పెట్టుకోవ‌డ‌మే ఉత్త‌మం అని భావించిన‌ట్లు తెలుస్తోంది. త్వ‌ర‌లో పొత్తుల గురించి జ‌న‌సేన ప్ర‌క‌టించ‌నుంది.