Shankaraiah: లంచం తీసుకుంటే త‌ప్పా?

is taking bribes a crime asks congress leader shankaraiah in assembly

Shankaraiah: లంచాలు తీసుకుంటే త‌ప్పా అని కాంగ్రెస్ నేత శంక‌ర‌య్య సాక్షాత్తు తెలంగాణ అసెంబ్లీలో వ్యాఖ్యానించ‌డం సంచ‌ల‌నంగా మారింది. వీఆర్వోలు లంచం తీసుకుంటే త‌ప్పేంటి అని ఆయ‌న అన్నారు. పాపం వీఆర్ఓలు పట్టా మార్పిడి కావడానికి 100, 200 రూపాయిలు లంచం తీసుకునే వాళ్లని కానీ ఇవాళ ధరణి వల్ల కలెక్టర్లే కలెక్షన్ కింగ్‌లు అయ్యారని ఆయ‌న అన‌డం ఎంత వ‌ర‌కు స‌బ‌బో ఆయ‌న‌కే తెలియాలి.