AP Elections: ప‌వ‌న్ గెలుపు.. చంద్ర‌బాబు ఓట‌మి?

is pawan winning and chandrababu losing in ap elections

AP Elections: ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో ఎట్ట‌కేల‌కు పోలింగ్ ముగిసింది. ఇక అధికారంలోకి వ‌చ్చేది ఎవ‌రా అనే ఉత్కంఠ‌ ఒక్క ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో మాత్ర‌మే కాదు ఇత‌ర రాష్ట్రాల ప్ర‌జ‌ల్లోనూ ఉంది. అయితే తెలుగు దేశం, జ‌న‌సేన పార్టీ అధినేత‌లు చంద్ర‌బాబు నాయుడు, ప‌వ‌న్ క‌ళ్యాణ్‌ల‌కు సంబంధించి ఒక ఆస‌క్తిక‌ర‌మైన విష‌యం వైర‌ల్ అవుతోంది. చంద్ర‌బాబు నాయుడు కుప్పం నుంచి ప‌వ‌న్ క‌ళ్యాణ్ పిఠాపురం నుంచి పోటీ చేసిన సంగ‌తి తెలిసిందే. అయితే నిన్న జ‌రిగిన పోలింగ్‌లో అత్య‌ధిక ఓటు శాతం పిఠాపురంలోనే న‌మోదైంది. దాంతో ఈసారి అక్క‌డ ప‌వ‌న్ గెలుపు త‌థ్య‌మ‌ని భావిస్తున్నారు. ఇక చంద్ర‌బాబు నాయుడు కుప్పంలో ఓడిపోతారు అనే టాక్ కూడా బ‌లంగా వినిపిస్తోంది.

అంతేకాదు.. మొన్న‌టివ‌ర‌కు మంగ‌ళ‌గిరిలో నారా లోకేష్ గెలుస్తార‌నే ప్ర‌చారం జ‌రిగింది. నిన్న పోలింగ్ త‌ర్వాత ఆ అంచ‌నాలు తారుమార‌య్యాయి. మంగ‌ళ‌గిరిలో 90 శాతం విజ‌యం వైఎస్సార్ కాంగ్రెస్‌దే అంటున్నారు రాజ‌కీయ విశ్లేష‌కులు. మ‌రోప‌క్క హిందూపూర్‌లో నంద‌మూరి బాల‌కృష్ణ కూడా గెలిచే అవ‌కాశాలు లేవు అనే అంటున్నారు. ఏదేమైనా జూన్ 4 త‌ర్వాత ఎవ‌రు అధికారంలోకి వ‌స్తారో తేలిపోద్ది.