Nara Lokesh రెడ్లను కలుపుకొని వెళ్తున్నారా?!

AP: TDP అధినేత, మాజీ సీఎం చంద్రబాబు(chandrababu) తనయుడు నారా లోకేష్‌ (nara lokesh) యువగళం పేరుతో ఏపీ వ్యాప్తంగా పాదయాత్ర చేస్తున్న విషయం తెలిసిందే. అయితే.. ఆయన పర్యటన నేపథ్యంలో అనేక అరుదైన సంఘటనలు చోటుచేసుకుంటున్నాయి. గత కొంత కాలంగా సీఎం జగన్‌ రెడ్డి(jagan) అంటూ… రెడ్లను టార్గెట్‌ చేసిన లోకేష్‌ ప్రస్తుతం స్వరం మార్చినట్లు కనిపిస్తున్నారు. యువగళం పాదయాత్ర దగ్గరి నుంచి రెడ్డి(reddy) అనే పేరు ఉచ్చరించకుండా… జగన్‌ అంటూ లోకేష్‌ పిలుస్తున్నారు. అంతేకాకుండా.. ఇటీవల నంద్యాల పర్యటనలో భాగంగా ఆయన ఓ ప్రాంతంలో ఉన్న దివంగత మాజీ సీఎం డా.వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి(ysr) విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. అయితే.. లోకేష్ రెడ్ల భజన చేయడం వెనుక అసలు కారణం ఇప్పుడు తెలుసుకోండి.

నారా లోకేష్‌ ఇటీవల స్పీడ్‌ పెంచారు. ఫుల్‌ జోష్‌తో ప్రత్యర్థులకు సెల్ఫీ చాలెంజ్‌లు, మాటల తూటాలు పేలుస్తున్నారు. ఆయనలో ఇంకో మార్పు కూడా వచ్చింది. తొలినుంచి జగన్‌ రెడ్డి అని సంభోదించే లోకేష్‌లో ఇప్పడు ఆ పేరు పెద్దగా ప్రస్తావించట్లేదు. దీనికి కారణం కూడా లేకపోలేదు. రెడ్లను రెచ్చగొట్టడం లేదా అవమానపరచడం వల్ల ఆ పార్టీలో ఉన్న రెడ్డి కులానికి చెందిన నాయకులు, కార్యకర్తలు హర్టయ్యే అవకాశం లేకపోలేదు. దీంతోపాటు ఇటీవల నెల్లూరు జిల్లా నుంచి ముగ్గురు రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వైసీపీ ఎమ్మెల్యేలు టీడీపీలోకి చేరతామాని పరోక్షంగా తమ ఇష్టాన్ని తెలియజేశారు. దీంతో రెడ్డి సామాజిక వర్గాన్ని టార్గెట్‌ చేసి ఓటర్లను దూరం చేసుకోవడం ఎందుకని లోకేష్‌ గ్రహించినట్లు ఉన్నారు. అందుకే రెడ్లకు దగ్గరయ్యే ప్రయత్నం చేస్తున్నారు. దీంతోపాటు వైసీపీ నుంచి మరికొంతమంది నాయకులు టీడీపీలో చేరతారని టాక్‌ నడుస్తోంది. అందుకే లోకేష్‌ చాకచక్యంగా వ్యవహరిస్తున్నారు. దొరికిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ.. ముందుకు వెళ్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఇటీవల వైఎస్సార్‌ విగ్రహానికి లోకేష్‌ పూలమాల వేశారు.