Kodali Nani: గుడివాడ బరి నుంచి అవుట్?
Kodali Nani: గుడివాడ బరిలో కొడాలి నానికి అడుగడుగునా చుక్కెదురవుతోంది. గతంలో ఇచ్చిన హామీలు, చేసిన సవాళ్లు ఏమయ్యాయని నిలదీస్తున్నారు. ప్రచారం కోసం వెళ్లిన కొడాలి నానిని.. ప్రశ్నలతో ఓటర్లు కడిగి పారేస్తున్నారు. ఓటర్లు నిలదీస్తుంటే కొడాలి నాని నీళ్లు నములుతున్నారు. సొంత నియోజకవర్గంలోనే కొడాలి నానికి ఇప్పుడు ఎదురుగాలి వీస్తోంది. నాని బూతు లీడర్ అంటూ విపక్ష నేతలు ప్రజలు విమర్శిస్తున్నారు. అధికార మదంతో ఇష్టానుసారం సవాళ్లు చేసే ఈయన ఇప్పుడు తప్పించుకోవాలనుకుంటున్నారు. ఇంతకీ కొడాలి నాని చేసిన సవాలేంటి?
“” పేదలకు స్థలాలు ఇప్పించలేని వెదవలు ఈరోజు రాజకీయ ఉపన్యాసం చెప్తున్నారు. మీకు దమ్ముంటే… నేనూ వస్తా.. ఈ గుడివాడ పట్టణంలో మేం లబ్ధిదారులం మాకు ఇంటి స్థలం రాలేదని ఒక్కరితో అయినా చెప్పించినా ఎన్నికల్లో పోటీ చేయను“” అన్నారు. అధికార పార్టీ లీడర్ అని ఏం మాట్లాడినా చెల్లుతుందని ఎవరూ అడిగే వారు ఉండరని భావించే కొడాలి నాని గతంలో ఇళ్ల స్థలాల విషయంలో సవాల్ చేసారు. ఏపీలో ఎన్నడూ పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వలేదన్నట్లు మాట్లాడారు. అలా చెప్పుకున్న కొడాలి నాని నిజంగా పేదలకు ఇళ్ల స్థలాలు ఇచ్చి ఉంటే ప్రజలు మంగళ హారతులు పట్టేవారు. కానీ అలా జరగలేదు.
నిన్న గుడివాడలో నాని ప్రచారానికి వెళ్లగా.. స్థానిక లబ్ధిదారులు నిలదీసారు. మరి ఇప్పుడు వాటికి కొడాలి నాని సమాధానం చెప్తారో.. క్షమాపణలు చెప్తారో ఆయనకే తెలియాలి. లబ్ధిదారులు నేరుగా ఆయన్నే ఇళ్ల స్థలాల గురించి నిలదీస్తున్నారు కాబట్టి మరి ఆయన సవాల్ చేసినట్లుగా పోటీ నుంచి తప్పుకుంటారా అని ప్రతిపక్ష పార్టీలు ప్రశ్నిస్తున్నాయి.