Kethireddy Venkatarami Reddy: చంద్రబాబుకు మద్దతుగా కేతిరెడ్డి.. జగన్‌కు షాకిస్తారా?
Kethireddy Venkatarami Reddy: రాజకీయాల్లో అధికార పార్టీపై ప్రతిపక్ష పార్టీ, ప్రత్యర్ధి పార్టీలు విమర్శలు చేసుకోవడం సర్వసాధారణం. ఒక పార్టీ అధికారంలోకి రాగానే ఆ పార్టీ ఇచ్చిన హామీలు నెరవేర్చలేదు అంటూ ప్రతిపక్ష పార్టీలు రోజూ ఏవో ఒక విమర్శలు చేస్తూ ఉంటాయి. ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో ఇదే రాజకీయం నడుస్తోంది. అయితే.. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మాత్రం రోజూ ఏదో ఒక ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంటూ ఉంటుంది.
రాజకీయాల్లో ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు వేరయా అన్నట్లుగా సాగుతుంటాయి. ఇప్పుడు మ్యాటర్ ఏంటంటే.. ధర్మవరం మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామి రెడ్డి వైఎస్సార్ కాంగ్రెస్‌లో ఉంటూ తెలుగు దేశం, కూటమి ప్రభుత్వం గురించి పాజిటివ్‌గా మాట్లాడటం. తెలుగు దేశం పార్టీ అధికారంలోకి వచ్చి కేవలం రెండు నెలలే అయ్యిందని.. ఈలోగా వైఎస్సార్ కాంగ్రెస్ నేతలు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇచ్చిన పథకాలను అమలు చేయడం లేదంటూ ఎందుకు అంత అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారని ఆయన విమర్శించారు. ఏ ప్రభుత్వానికైనా కాస్త సమయం ఇచ్చి అప్పుడు విమర్శలు, రాజకీయాలు చేస్తే బాగుంటుందని ఆయన అభిప్రాయపడ్డారు.
గతంలో కూడా ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ ఓడిపోవడానికి ప్రధాన కారణం అధికారంలో ఉన్నప్పుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తన లాంటి ఎందరో ఎమ్మెల్యేలకు కనీసం అపాయింట్మెంట్ కూడా ఇవ్వకపోవడమే అని అదే ఇప్పుడు కొంప ముంచిదని డైరెక్ట్‌గానే అనేసారు. దాంతో కేతిరెడ్డి చూపు తెలుగు దేశం, కూటమి ప్రభుత్వాలపైకి మళ్లుతోందా అనే చర్చ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో మొదలైంది. అసలు కేతిరెడ్డి మన పార్టీలో ఉన్నాడా? లేక కూటమిలో ఉన్నాడా? అనేలా ఆయన వ్యాఖ్యలు ఉన్నాయంటూ నేతలు అంతర్గతంగా చర్చలు చేసుకుంటున్నారు.