G30 కూటమితో KCR ఓటమి ఖాయమేనా?

Hyderabad: తెలంగాణలో గత కొన్ని రోజులుగా కొత్త పార్టీ అవతరిస్తుందని జోరుగా ప్రచారం సాగుతోంది. అయితే.. దీనిపై ఇప్పటికైతే స్పష్టత లేదు. కానీ కేసీఆర్‌ సర్కార్‌(kcr govt)ను ఓడించడానికి మాత్రం అనేక కూటములు రానున్న ఎన్నికల్లో ఏకతాటిపైకి వచ్చేలా ఉన్నాయి. ఇక ఇప్పటికే కర్నాటకలో విజయం సాధించిన కాంగ్రెస్‌(congress).. తెలంగాణలో కూడా తన బలన్ని చాటి అధికారం చేజిక్కించుకోవాలని చూస్తోంది. బీజేపీ(bjp) మాత్రం మూడో ఫ్రంట్‌గా మారిపోయినట్లు కనిపిస్తోంది. ఎందుకంటే కర్నాటకలో బీజేపీ హిందుత్వం అనే కార్డుతో వెళ్లి ఓటమి పాలైందని.. తెలంగాణలో కూడా హిందుత్వం వర్కౌట్‌ కాదని ఈటెల రాజేందర్‌, తదితర నాయకులు చెబుతున్నారు. కానీ బీజేపీ సిద్దంతం ప్రకారం నడిచే పార్టీ కాబట్టి అధిష్టానందే తుది నిర్ణయం అవుతుంది. ఈ రెండు పార్టీల పరిస్థితి ఇలా ఉండగా.. ఇటీవల బీఆర్‌ఎస్‌ నుంచి సస్పెండ్‌కు గురైన పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డి(ponguleti srinivas reddy).. పలువురు పార్టీ నాయకులు, తెలంగాణ ఉద్యమ కారులతో కలసి సమ్మేళనాలు నిర్వహిస్తారు.

ఈ సమ్మేళనాలలో పొంగులేటితోపాటు, జూపల్లి కూడా పాల్గొంటున్నారు. దీనిలో ఇటీవల తెలంగాణ ఉద్యమ నేత, ఫ్రొఫెసర్‌ కోదండ రామ్‌(kodanda ram) కూడా పాల్గొన్నారు. అయితే.. వీరి కలయిక.. కొత్త రాజకీయ పునరీకరణకు దారి తీస్తుందా.. అనే ప్రశ్న లేవనెత్తుతోంది. కానీ వీరి వెనుక ఉన్న అజెండా మాత్రం కేసీఆర్‌ను గద్దె దించడమే. దీంతో కేసీఆర్‌పై పార్టీలకు అతీతంగా ఫైట్‌ చేయాలనుకుంటున్న వ్యక్తులు కలిసి రావాలని పొంగులేటి కోరుతున్నారు. వీరి కూటమికి జీ30 అనే పేరు కూడా పెట్టారు. దాదాపు 30 మంది అభ్యర్థులు కలిసి కేసీఆర్‌ను ఓడించడానికి కంకణం కట్టుకున్నట్లు కనిపిస్తోంది. మరి వీరందరూ కొత్త పార్టీ పెడతారా? లేదా కాంగ్రెస్‌, బీజేపీతో కలిసి ఎన్నికలకు వెళ్లి.. కేసీఆర్‌ను ఎదుర్కోంటారా అన్నది తెలియాల్సి ఉంది. ఇక G30 కూటమిలోకి ఈటెలతోపాటు, పలువురు నాయకులు వస్తారని టాక్‌ నడుస్తోంది.