చంద్రబాబుకు ప్రాణహాని.. లైవ్‌లో ఈసారి మిస్సవ్వడు అంటూ వ్యాఖ్యలు
ఎన్నికల్లో ఓడిపోయారన్న కోపమో.. ఒక వ్యక్తి పట్ల కక్షో తెలీదు కానీ.. లైవ్‌లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చావు గురించి మాట్లాడటం ఎంత వరకు సమంజసం? సాక్షి ఛానెల్‌లో వైఎస్సార్ కాంగ్రెస్ ప్రజాప్రతినిధి అని చెప్పుకునే నాగార్జున యాదవ్ లైవ్‌లో ఈ వ్యాఖ్యలు చేసారు. ఒకప్పుడు అలిపిరిలో చంద్రబాబు తప్పించుకున్నారు. ఈసారి వెంకటేశ్వరస్వామి తప్పించలేడు అని అన్నాడు. అంటే ఏంటి దానర్థం? చంద్రబాబును వారే చంపాలని చూస్తున్నారా? ఆయన చావును కోరుకుంటున్నారా? మరి వారి వ్యాఖ్యలు చూస్తుంటే నిజమే అనిపిస్తోంది.
రాజకీయాల్లో గెలుపు ఓటములు సర్వసాధారణమే అని జగన్ ఎప్పుడూ అంటూ ఉంటారు. మరి అధినేత మాటల్ని పాటించాల్సిన బాధ్యత పార్టీ నేతలకు లేదా? ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్ అయ్యన్నపాత్రుడు జగన్‌ను రాజకీయంగా చంపాలి అని అన్నందుకే జగన్ హత్యకు కుట్ర అని సాక్షిలో ఊదరగొట్టారు. మరి లైవ్‌లో ఈసారి చంద్రబాబు నాయుడు చావు నుంచి తప్పించుకోలేరు అన్నప్పుడు తెలుగు దేశం, జనసేన పార్టీ నేతలు సరైన సమాధానం చెప్పరా? డిబేట్లు పెట్టి నానా హడావుడి చేసే ఛానెల్స్ ఎవరిని స్టూడియోకి పలుస్తున్నారో చూసుకోవాల్సిన బాధ్యత ఉంది. ఎవడు పడితే వాడిని పిలిపించి వాడి చేత నోటికొచ్చినట్లు వాగించేలా చేస్తే ఎవరికి నష్టం?
కనీసం ఇప్పుడు కూడా జగన్ నాగార్జున యాదవ్ చేసిన వ్యాఖ్యలను ఖండిస్తున్నానని.. రాజకీయాల్లో రాజకీయంగానే ఎదగాలని ఒక్క ట్వీట్ కూడా వేయలేదు. మరి జగన్ ఎలాంటి రాజకీయాలకు బీజం వేస్తున్నట్లు?