Iran: బైడెన్ నోటిదూల… బాంబు పేల్చిన ఇరాన్
Iran: అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ నోటిదూల వల్ల ఇరాన్ బాంబు పేల్చింది. హెజ్బొల్లా చీఫ్ హస్సన్ నస్రల్లా, హమాస్ నేత ఇస్మాయిల్ హనియేలను ఇజ్రాయెల్ మట్టుబెట్టిన సంగతి తెలిసిందే. వీరిద్దరూ ఇరాన్‌లో ఉన్నప్పుడే హత్యకు గురయ్యారు. దాంతో ఇరాన్ ఇజ్రాయెల్‌పై 150 మిస్సైళ్లతో దాడులకు పాల్పడింది. మరి ఇజ్రాయెల్ ఊరుకోదు కదా. దాంతో ఇరాన్‌కు ఎలాగైనా బుద్ధి చెప్పాలని ఎప్పుడో నిర్ణయించేసుకుంది. ఆ రెండు దేశాలు వారి చావు వారు చస్తున్నాయి. చాదస్తం వల్లో ఏమో కానీ.. బైడెన్ నోటిదూల వల్ల ఇప్పుడు అమెరికా వణికిపోతోంది.
ఊరుకుని ఉండక.. మీడియా వర్గాలతో బైడెన్ ఓ మాటన్నారు. ఇజ్రాయెల్ ఇరాన్‌పై ఎలా దాడి చేయబోతోందో.. ఎలా బుద్ధి చెప్పబోతోందో నాకు తెలుసు అన్నారు. దాంతో మీడియా వర్గాలు ఎలా సర్ ఎలా సర్ అని గుచ్చి గుచ్చి అడిగినా నేను అస్సలు చెప్పను అనేసి వెళ్లిపోయారు. దాంతో ఇజ్రాయెల్ ఇరాన్‌పై ఎలా దాడి చేయబోతోందో అమెరికాకి తెలుసు అని మీడియా వర్గాలు కోడై కూసాయి. దీనిపై తాజాగా ఇరాన్ స్పందించింది. బైడెన్ ఇజ్రాయెల్ ప్లాన్ చెప్పడంలేదు. మాకు ఇజ్రాయెల్ వల్ల ఏమన్నా అయితే.. దానికి అమెరికానే బాధ్యత వహించాలని ప్రకటన విడుదల చేసింది.