Malkajgiri: అతిపెద్ద నియోజకవర్గం.. రెండోసారి గెలవని పార్టీలు
Telangana Elections: తెలంగాణ ఎన్నికలు దగ్గరపడుతున్న నేపథ్యంలో రాష్ట్రంలోనే అతిపెద్ద నియోజకవర్గం అయిన మల్కాజ్‌గిరి (malkajgiri) ఇప్పుడు కాస్త చర్చనీయాంశంగా మారింది. ప్రస్తుతం ఈ నియోజకవర్గానికి ఇటీవల అలిగి BRS నుంచి వెళ్లిపోయి కాంగ్రెస్‌లో (congress) చేరిన మైనంపల్లి హనుమంతరావు (mynampally hanumanth rao) ఎమ్మెల్యేగా ఉన్నారు. 2019 నాటికి మల్కాజ్‌గిరిలోని ఓటర్ల సంఖ్య 3,150,303. ఇప్పుడు మరింత పెరిగి ఉంటుంది. త్వరలో జరగబోయే తెలంగాణ ఎన్నికల్లో ఎందుకు మల్కాజ్‌గిరి (malkajgiri) కీలకమో ఓసారి చూద్దాం.
రిపీట్ అయ్యిందే లేదు..!
మల్కాజ్‌గిరి ఓటర్లు ఎప్పుడూ కూడా ఒకే పార్టీకి ఓటు లేదు. అంటే ఒకే పార్టీకి చెందిన నేత మళ్లీ ఇక్కడ ఎమ్మెల్యేగా గెలిచింది లేదు. మల్కాజ్‌గిరిని మిని ఇండియా అని కూడా పిలుస్తారు. 2019 నాటికి ఇక్కడున్న ఓటర్లలో సగం మంది సీమాంధ్రకు చెందినవారే అని డీలిమిటేషన్‌లో తేలింది. 2009 ఎన్నికల్లో మల్కాజ్‌గిరిలో కాంగ్రెస్ నేత సార్వే సత్యనారాయణ గెలిచారు. ఆ తర్వాత 2014 ఎన్నికల నాటికి తెలుగు దేశం పార్టీ.. భారతీయ జనతా పార్టీతో పొత్తు పెట్టుకుని మరీ బరిలోకి దిగింది. దాంతో 2014 ఎన్నికల్లో మల్కాజ్‌గిరిలో TDP-BJP నేత మల్లారెడ్డి గెలిచారు.
2016 నాటికి మల్కాజ్‌గిరి ఓటర్ల మూడ్ మారిపోయింది. వారి చూపు అప్పటి తెలంగాణ రాష్ట్ర సమితిపై (BRS) పడింది. మల్కాజ్‌గిరిలో 2016 సంవత్సరం జనవరి, ఫిబ్రవరి మధ్యలో జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో BRS భారీ విజయం సాధించింది. ఆ తర్వాత అదే విజయ పథం కొనసాగించి 2018 ఎన్నికల్లో మల్కాజ్‌గిరి నియోజకవర్గాన్ని దక్కించుకుంది. (malkajgiri)
ఓటమిని ఒప్పుకోని ప్రతిపక్షాలు
మల్కాజ్‌గిరిలో అన్నీ ఊడ్చుకుపోయిన భారత రాష్ట్ర సమితి (అప్పుడు TRS ) పార్టీపై ప్రతిపక్షాలు మండిపడ్డాయి. ఓటమిని ఒప్పుకోలేక BRS పార్టీ రిగ్గింగ్‌కు, ట్యాంపరింగ్‌కు పాల్పడిందని ఆరోపించాయి.
మళ్లీ గెలవాలని ప్రయత్నిస్తున్న BRS
నవంబర్ 30న జరిగే ఎన్నికల్లో పార్టీ మల్కాజ్‌గిరిలో మళ్లీ గెలవాలని ప్రయత్నిస్తోంది. మళ్లీ మైనంపల్లి హనుమంతరావుకే టికెట్ ఇచ్చారు సీఎం KCR. కానీ తన కుమారుడికి టికెట్ ఇవ్వకపోవడంతో మైనంపల్లి అలిగి కాంగ్రెస్‌లో చేరారు. దాంతో ఇప్పుడు మైనంపల్లి స్థానంలో మల్లా రెడ్డి అల్లు మర్రి రాజశేఖర్ రెడ్డికి (marri rajasekhar reddy) టికెట్ ఇచ్చే యోచనలో BRS పార్టీ ఉన్నట్లు తెలుస్తోంది. ఒకవేళ రాజశేఖర్ రెడ్డి గెలిస్తే.. అది BRS పార్టీకి రికార్డ్ అనే చెప్పాలి. (telangana elections)