AP Elections: పులివెందుల‌లో తెర‌వెనుక రాజ‌కీయం

interesting politics happening in pulivendula ahead of ap election counting

AP Elections: ఆంధ్ర‌ప్ర‌దేశ్ ఎన్నిక‌ల ఫ‌లితాలు వెలువ‌డ‌నున్న నేప‌థ్యంలో పులివెందుల‌లో తెరవెనుక కొత్త రాజకీయం జరుగుతోంది. పులివెందుల ఎంపీ అభ్య‌ర్ధి అయిన వైఎస్ అవినాష్ రెడ్డి వ‌ర్గానికి చెందిన ప‌లువురు వ్య‌క్తులు తెలుగు దేశం పార్టీతో స‌న్నాహాలు జ‌రుపుతున్న‌ట్లు టాక్ న‌డుస్తోంది. అవినాష్ రెడ్డి వ‌ర్గం తెలుగు దేశం పార్టీతో చీక‌టి ఒప్పందానికి ప్ర‌య‌త్నిస్తోంద‌ని ఆ పార్టీ కార్య‌కర్తలు అంటున్నారు.

పోలింగ్‌కి రెండు రోజుల ముందు 25 పోలింగ్ బూత్‌ల‌లో తెలుగు దేశం వారు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేయిస్తే.. అసెంబ్లీ స్థానాల‌కు తాము తెలుగు దేశం పార్టీకి ఓట్లు ప‌డేలా చూస్తామ‌ని మంత‌నాలు జ‌రిపిన‌ట్లు వెల్ల‌డించారు. అలా జ‌గ‌న్ పార్టీకి ప‌డాల్సిన ఓట్ల‌కు అవినాష్ రెడ్డి గండికొట్టే ప్ర‌య‌త్నం చేసార‌ట‌. ఈ నేప‌థ్యంలో అవినాష్ రెడ్డి, భాస్క‌ర్ రెడ్డి వ‌ర్గానికి చెందిన‌వారు తెలుగు దేశం పార్టీ పులివెందుల ఎమ్మెల్యే అభ్య‌ర్ధి బీటెక్ ర‌వితో మంత‌నాలు జరిపార‌ట‌. వైఎస్సార్ కాంగ్రెస్ బూట‌క‌పు హ‌త్యా రాజ‌కీయాల గురించి అణువ‌ణువు తెలిసిన ర‌వి ఇందుకు స‌సేమిరా అన్నార‌ట‌.