మా జమ్మూ కాశ్మీర్‌పై మీ పెత్తనమేంటి? చైనా, పాకిస్థాన్‌కు కలిపి వడ్డించిన భారత్
India: చైనా పాకిస్థాన్ చర్చలు జరుపుతూ జమ్మూ కాశ్మీర్ గురించి చేసిన కామెంట్స్‌పై స్పందించింది భారత ప్రభుత్వం. మధ్య మా జమ్మూ కాశ్మీర్‌పై మీ పెత్తనమేంటి అని ఇరు దేశాలకు కలిపి వడ్డించింది. జమ్మూ కాశ్మీర్‌తో పాటు లఢక్ కూడా భారత్‌లో భాగమే అని ఈ అంశంపై ఏ దేశానికీ మాట్లాడే హక్కు లేదని హెచ్చరించింది.
చైనా పాకిస్థాన్ ఎకనామిక్ కారిడార్ (CPEC) పాక్ ఆక్రమిత కాశ్మీర్ మీదుగానే వస్తుంది. దీనిని మన దేశం అంతర్గత ప్రదేశంగా పరిగణిస్తోంది. ఈ CPEC గురించి భారత్ ఎప్పుడూ వ్యతిరేకంగా ఉంది. జమ్మూ కాశ్మీర్‌లో పరిస్థితిపై పాకిస్థాన్ చైనాకు అప్‌డేట్ చేసిందని, ఐక్యరాజ్యసమితి చార్టర్, ద్వైపాక్షిక ఒప్పందాల ఆధారంగా శాంతియుత తీర్మానం కోసం చైనా పిలుపునిచ్చిందని ప్రకటన వెల్లడైంది. దాంతో భారత్ ఈ అంశంపై స్పందించాల్సి వచ్చింది. అసలు జమ్మూ కాశ్మీర్ గురించి చైనా పాక్ ఎందుకు చర్చించుకుంటున్నాయని భారత ప్రభుత్వం ప్రశ్నించింది.