India Alliance: ప్రధాని పదవిని ఆశిస్తున్న 15 మంది..!
India Alliance: రానున్న లోక్ సభ ఎన్నికల్లో (lok sabha elections) భారతీయ జనతా పార్టీని (BJP) NDA కూటమిని కూలదోసి అధికారాన్ని చేజిక్కించుకోవాలన్న ఉద్దేశంతో దాదాపు 26 పార్టీలతో కలిసి కూటమిని ఏర్పాటుచేసింది కాంగ్రెస్ పార్టీ. ఆ కూటమికి INDIA అని పేరు కూడా పెట్టింది. అయితే ఎన్నికలు జరగడానికి ముందే కూటమిలో చీలకలు, అలకలు మొదలయ్యాయి.
ఎన్నికల్లో గెలిచాక ఎవరు ప్రధాన మంత్రి పదవికి అర్హులు అనే చర్చ ఇప్పటినుంచే మొదలైంది. ఇప్పటికే రాహుల్ గాంధీ, బిహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్, వెస్ట్ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ప్రధాని పదవికి అర్హులు అని కొందరు అభిప్రాయపడుతున్నారు. కానీ ఇప్పుడు 26 పార్టీల నుంచి కూడా నేను ప్రధానిని అవుతా అంటూ అభ్యర్ధులు బయటికి వస్తారని BJP నేత, ప్రముఖ నటుడు రవి కిషన్ (ravi kishan) కామెంట్ చేసారు.