SVSN Varma: ప‌వ‌న్ ఎంపీగా పోటీ చేస్తే పిఠాపురం ఎమ్మెల్యే నేనే

జ‌న‌సేన (Janasena) అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్ (Pawan Kalyan) రానున్న ఆంధ్ర‌ప్ర‌దేశ్ ఎన్నిక‌ల్లో (AP Elections) పిఠాపురం నుంచి పోటీ చేస్తున్న సంగ‌తి తెలిసిందే. అయితే ఈ సీటుపై తెలుగు దేశం పార్టీ నుంచి SVSN వ‌ర్మ క‌న్ను ఉంది. ఈ సీటు నుంచి తానే పోటీ చేస్తాన‌ని అనుకున్నాడు. కానీ ఎప్పుడైతే ప‌వ‌న్ క‌ళ్యాణ్ తాను ఇక్కడి నుంచి పోటీ చేస్తాన‌ని ప్ర‌క‌టించారో అప్ప‌టి నుంచి వ‌ర్మ కోపంతో ఉన్నారు. తెలుగు దేశం పార్టీ (Telugu Desam Party) నుంచి కాకుండా ఇండిపెండెంట్‌గా పోటీ చేస్తాన‌ని ప్ర‌క‌టించారు.

ఎలాగైనా ప‌వ‌న్‌ను ఓడించి తీర‌తాన‌ని అన్నారు. కానీ మ‌ధ్య‌లో తెలుగు దేశం పార్టీ అధినేత చంద్ర‌బాబు నాయుడు (Chandrababu Naidu) క‌ల‌గ‌జేసుకుని వ‌ర్మ‌తో మాట్లాడి న‌చ్చ‌జెప్పారు. ప‌రిస్థితిని అర్థం చేసుకున్న వ‌ర్మ‌.. తాను ప‌వ‌న్‌కు పోటీ పూర్తిగా మ‌ద్ద‌తు ఇస్తాన‌ని అన్నారు. అయితే ఇప్పుడు వర్మ మ‌రో వెర్ష‌న్ మాట్లాడుతున్నారు. ప‌వ‌న్ క‌ళ్యాణ్ కాకినాడ నుంచి ఎంపీ అభ్య‌ర్ధిగా పోటీ చేస్తార‌ని అనుకున్నాన‌ని.. ఒక‌వేళ ఆయ‌న ఎంపీగా పోటీ చేస్తే తాను పిఠాపురం నుంచి పోటీ చేస్తాన‌ని అన్నారు. కానీ ప‌వన్ క‌ళ్యాణ్ కాకినాడ నుంచి ఉద‌య్ శ్రీనివాస్‌ను బ‌రిలోకి దింప‌నున్న‌ట్లు ప్ర‌క‌టించారు.