Nara Lokesh: తారక్ రాజకీయాల్లోకి వస్తానంటే నేనెందుకు ఆపుతాను?
Nara Lokesh: జూనియర్ ఎన్టీఆర్ (JR NTR) రాజకీయాల్లోకి వచ్చి పార్టీ కోసం పనిచేస్తానంటే నేనెందుకు ఆపుతాను అని అన్నారు ఆంధ్రప్రదేశ్ ఐటీ మినిస్టర్ నారా లోకేష్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గతేడాది జైలు పాలైనప్పుడు నందమూరి కుటుంబం మొత్తం బాసటగా నిలిచింది. కానీ జూనియర్ ఎన్టీఆర్ మాత్రం ఎలాంటి ట్వీట్ కానీ మద్దతు ఇస్తున్నట్లు ఒక మాట కానీ మాట్లాడలేదు. దీనిపై నారా లోకేష్ స్పందిస్తూ.. బాబు గారికి మద్దతు ఇవ్వాలా వద్దా అనేది పూర్తిగా ఎన్టీఆర్ ఇష్టమని.. ఈ విషయంలో తాను మాట్లాడాల్సింది ఏమీ లేదని అన్నారు.
ఇక తారక్ రాజకీయ రంగ ప్రవేశం గురించి మాట్లాడుతూ.. “” నేను ప్రజలకు సేవ చేయాలని రాజకీయాల్లోకి వచ్చాను. అలాగే తారక్‌కి అనిపించినప్పుడు తనూ వస్తాడు. రాజకీయాల్లోకి ఎవరైనా రావచ్చు. తారక్ వస్తానంటే నేనెందుకు ఆపుతాను? అది ఎవరి ఇష్టం వారిది కదా “” అని సమాధానమిచ్చారు.