చంద్రబాబు నాయుడుకి ప్రధాని.. పవన్‌కి సీఎం అయ్యే ఛాన్స్..!
Chandrababu Naidu: ఎవరైనా ఊహించారా? కేంద్రంలో ఎవరు అధికారంలో రావాలి అనేది ఇప్పుడు తెలుగు దేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు చేతిలో ఉంది. ఆయన ఎన్డీయే కూటమికి మద్దతు ఇస్తే మళ్లీ నరేంద్ర మోదీ ప్రధాని అవుతారు. అదే ఇండియా కూటమికి ఇస్తే అయితే రాహుల్ గాంధీ అవుతారు లేదా చంద్రబాబు నాయుడే ప్రధాని అవుతారు. ఈ ఒక్క అవకాశాన్ని చంద్రబాబు సద్వినియోగం చేసుకుంటే ఆయన ప్రధాని అయ్యి.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి పదవి పవన్ కళ్యాణ్‌కు ఇస్తే సరిపోతుంది. కానీ చంద్రబాబు ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీతో కలిసి పోటీ చేసారు కాబట్టి ఇంకోసారి ఎన్డీయేకి ద్రోహం చేయరు అనిపిస్తోంది. కానీ చంద్రబాబుకు ప్రధాని అయ్యే అవకాశం ఇదే. మళ్లీ ఇలాంటి అవకాశం వస్తుందో లేదో..!