కళైనార్ మనవడిని… నేను సారీ చెప్పాలా?
Udayanidhi Stalin: సనాతన ధర్మంపై తాను చేసిన వ్యాఖ్యలను మీడియా వాళ్లు వక్రీకరించి రాస్తే తానెందుకు సారీ చెప్పాలని అన్నారు తమిళనాడు డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్. కళైనార్ (కరుణానిధి) మనవడిని.. నేను సారీ చెప్పడమేంటి అంటూ మండిపడ్డారు. సనాతన ధర్మంపై తాను చేసిన వ్యాఖ్యలు వెనక్కి తీసుకోనని.. సనాతన ధర్మం పేరిట మహిళలపై ఇప్పటికీ చూపుతున్న వివక్ష పట్ల తాను మాట్లాడానే కానీ ధర్మంపై కాదని అన్నారు. “” ఆడవాళ్లకు చదువుకునే హక్కు లేదు. ఇంట్లో నుంచి బయటికి వెళ్లనివ్వరు. భర్త చనిపోతే వారిని కూడా చావమంటారు. నేను దీని గురించి మాట్లాడితే మీరు మొత్తం సనాతన ధర్మాన్నే అవమానించారని అంటున్నారు. అలాంటప్పుడు నేనెందుకు సారీ చెప్పాలి “” అంటూ ఓ కార్యక్రమంలో మాట్లాడారు.