Komatireddy Venkat Reddy: చెల్లెమ్మ వస్తే వద్దంటానా?
Hyderabad: మా చెల్లెమ్మ షర్మిల (ys sharmila) కాంగ్రెస్‌లోకి వస్తే మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తాం అని అన్నారు సీనియర్ కాంగ్రెస్ నేత కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి (komatireddy venkat reddy). ఢిల్లీ నుండి హైదరాబాద్‌కు వీరిద్దరూ ఒకటే ఫ్లైట్‌లో కలిసి వచ్చారు. అయితే YSR తెలంగాణ పార్టీని కాంగ్రెస్ పార్టీలోకి విలీనం చేస్తున్న విషయమై మీడియా అడిగిన ప్రశ్నలకు షర్మిళ మౌనంగా వెళ్లిపోయారు. ఈ ప్రశ్నలకు కోమటిరెడ్డి సమాధానం చెప్తూ.. షర్మిలను మనస్పూర్తిగా పార్టీలోకి ఆహ్వానిస్తామని అన్నారు. పార్టీ విలీన ప్రక్రియ తుది దశకు చేరుకుంది.