KTR: మందు, డ‌బ్బు ఇస్తే వ‌చ్చే గెలుపు నాకొద్దు

ప్ర‌జ‌ల‌కు మద్యం, డ‌బ్బు పంచిపెడితేనే గెలుస్తామంటే అలాంటి గెలుపు త‌న‌కు వ‌ద్దని అన్నారు తెలంగాణ ఐటీ శాఖ మంత్రి KTR. ఇప్ప‌టివ‌ర‌కు తాను నాలుగు ఎలక్షన్లలో సిరిసిల్లలో కోట్లాడి గెలిచాన‌ని, ఏ ఒక్క ఎన్నికకు కూడా మందు, డబ్బు ఇవ్వలేదని అన్నారు. ఏదైనా చేస్తా కానీ ఆ దరిద్రపు పని మాత్రం చేయ్య‌న‌ని, రానున్న ఎన్నిక‌ల్లో త‌న‌తో పోటీ ప‌డ‌టానికి త‌యారైన వారంతా దమ్ముంటే మంచి పనుల్లో పోటీ పడండి అని స‌వాల్ చేసారు KTR.