Deve Gowda: 91 ఏళ్ల వయసులో కాంగ్రెస్ మోసాన్ని భరించలేను
నాకు ఇప్పుడు 91. కాంగ్రెస్ (congress) నన్ను ఎలా మోసం చేసిందో చూసాను. ఇక మళ్లీ మోసపోయే శక్తి నాకు లేదు అని అంటున్నారు JSD పార్టీ అధినేత దేవె గౌడ (deve gowda). ఇటీవల JDS.. BJPతో పొత్తును ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే ఈ రెండు పార్టీలు పొత్తు పెట్టుకోవడానికి ముందు JDU అధినేత నితీష్ కుమార్.. దేవె గౌడను కలిసి JDS, JDUలను విలీనం చేసి ఇండియా కూటమిలో (india bloc) కలిసిపోవాలని అడిగారట.
ఇందుకు దేవెగౌడ ససేమిరా అన్నట్లు తెలిపారు. తనకు జాతీయ పోస్టులపై ఆసక్తి లేదని ఈ 91 ఏళ్లలో కాంగ్రెస్ తనను చేసిన మోసాలను కళ్లారా చూసానని మళ్లీ కాంగ్రెస్తో చేతులు కలిపి ప్రయోగాలు చేయాలనుకోవడం లేదని దేవెగౌడ తెలిపారు. కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధారామయ్యను (siddaramiah) రాజకీయాల్లోకి తీసుకువచ్చింది తానేనని.. లోక్ సభ ఎన్నికల్లో (lok sabha elections) JDS గెలిస్తే సిద్ధారామయ్య వాకౌట్ చేస్తాడని దేవె గౌడ అంటున్నారు.