Revanth Reddy: చంద్రబాబుతో పోటీ పడే అవకాశం వచ్చింది
Revanth Reddy: తెలంగాణ ముఖ్యమంత్రిగా తనకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో పోటీ పడే అవకాశం వచ్చిందని అన్నారు రేవంత్ రెడ్డి. హైదరాబాద్‌లోని బసవతారకం హాస్పిటల్‌ను ఆయన ఈరోజు సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. “” మా అన్న నందమూరి బాలకృష్ణ బసవతారక క్యాన్సర్ ఆసుపత్రి 24వ వార్షికోత్సవ కార్యక్రమంలో పాల్గొనాలని నన్ను ఆహ్వానించారు. మనస్ఫూర్తిగా వారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నా.. తెలంగాణ ముఖ్యమంత్రిగా నాకు ఇదొక మంచి అవకాశం. ఎన్టీఆర్ ఆలోచనతో చంద్రబాబు నాయుడు సహకారంతో 24 సంవత్సరాలు పూర్తి చేసుకొని కోట్లాది మందికి సేవలు అందించిన ఈ సంస్థ కోసం పాల్గొనటం నాకు సంతోషాన్ని ఇచ్చింది. గతంలో 12 గంటలు పని చేస్తే సరిపోతుంది అనుకునే వాడిని.. ఇప్పుడు చంద్రబాబు 18 గంటలు చేసి నేను 12 గంటలు చేస్తే బాగుండదు కాబట్టి మనం కూడా 18 గంటలు పని చేయాల్సిందే అని మా అధికారులకు, సహచరులకు చెప్పాను“” అని తెలిపారు.