kodi kathi case: సానుభూతి ఓట్ల కోసమే జగన్‌పై దాడి చేశా

vijaywada: 2018 అక్టోబరు 25 వైజాగ్‌ విమానాశ్రయం(vizag airport)లో జగన్‌(jagan)పై కోడికత్తి(kodi kathi)తో దాడి చేశాడు జనుపల్లి శ్రీనివాస్‌. ఈ ఘటనపై అప్పట్లో సంచలనంగా మారింది. ఎవరు చేయించారు? అసలు శ్రీను(Srinu) అనే వ్యక్తి ఎవరు? దాడి ఎందుకు చేశాడు? ప్రతిపక్షాల కుట్ర ఏమైనా ఉందా అని అనేక రకాల ప్రశ్నలు అప్పట్లో ఉత్పన్నమయ్యాయి. తాజాగా ఈ ఘటనకు సంబంధించి.. 2019 జనవరి 17న కోడికత్తి కేసు నిందితుడు శ్రీను ఎన్‌ఐఏకి వాంగ్మూలం ప్రస్తుతం బయటకు వచ్చింది. అందులో పేర్కొన్న అంశాలు ఇలా ఉన్నాయి.

వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి(ys rajashekar reddy) తన అభిమాన నాయకుడని శ్రీను చెప్పుకొచ్చాడు. ఆయన మరణం తర్వాత… జగన్ అభిమానిగా మారానని, ఆయన పాదయాత్ర, ఓదార్పు యాత్రలు టీవీల్లో, ఫోనుల్లో చూసేవాడినని అతను పేర్కొన్నాడు. దీంతోపాటు జగన్‌ను కోడికత్తితో చంపాలనే ఉద్దేశం లేదని.. టీడీపీ(Tdp) హయాంలో రైతులు పడుతున్న ఇబ్బందులు, తదితర సమస్యలపై ఓ లేఖ రాశానని.. అది తనకు ఇష్టమైన జగన్‌కు ఇవ్వాలని అనుకున్నానన్నారు. కానీ ఇప్పటి నాయకులకు లేఖలు ఇస్తే అవి పీఏలకు ఇస్తారని, వాటిని చూసే సమయం వారికి ఉండదని భావించి.. తనపై అందరి దృష్టి పడేందుకు కోడికత్తితో జగన్‌పై దాడి చేశానని శ్రీను చెబుతున్నాడు. దాడికి ముందు జగన్‌తో *మీరు 160 సీట్లతో గెలుస్తారు సార్‌* అని నిందితుడు చెప్పాడు. దాడి తర్వాత మీకు ఏం కాదు.. సార్‌.. అని చెప్పానని… ఈక్రమంలో అక్కడ ఉన్న వైసీపీ నాయకులు తనపై దాడి చేస్తుంటే.. జగన్‌ కొట్టవద్దని చెప్పారని శ్రీను ఎన్‌ఐఏ నివేదికలో పేర్కొన్నాడు. జగన్‌కు ప్రాణహాని లేకుండా ఉండేందుకు చిన్న కత్తిని వినియోగించానని… చంపాలని ఉద్దేశం లేదని అన్నారు. దాడికి ముందు కత్తిని రెండు సార్లు స్టెరిలైజ్‌ చేశారని శ్రీను చెబుతున్నాడు. కేవలం సానుభూతి కోసం కోడికత్తి దాడి జరిగిందని.. దాని వల్ల జగన్‌ గెలుస్తారని భావించానని పేర్కొన్నాడు.