DK Shivakumar: గెలుపు వెన‌క “హ‌స్తం” నాదే.. పార్టీ గుర్తించాలి

Delhi: క‌ర్ణాట‌క ఎన్నిక‌ల్లో(karnataka elections) కాంగ్రెస్(congress) గెల‌వ‌డం వెన‌క త‌న కృషి ఎంతో ఉంద‌ని అన్నారు రాష్ట్ర కాంగ్రెస్ చీఫ్ డీకే శివ‌కుమార్(dk shivakumar). క‌ర్ణాట‌క ముఖ్య‌మంత్రి రేసులో సిద్ధ‌రామ‌య్య‌(siddaramiah), శివ‌కుమార్‌లు(shivakumar) ఉన్నారు. అయితే హై క‌మాండ్ సిద్ధ‌రామ‌య్య‌నే సీఎం చేయాల‌ని అనుకుంటున్న‌ట్లు తెలుస్తోంది. దీని గురించి శివ‌కుమార్ స్పందించారు. త‌మ ఇద్ద‌రిలో సీఎం ఎవ‌రైనా ఫ‌ర్వాలేద‌ని, సిద్ధ‌రామ‌య్య సీఎం అయితే తాను పోరాడ‌టం, బ్లాక్‌మెయిల్ చేయ‌డం లాంటివి చేయ‌న‌ని అన్నారు. అయితే.. క‌ర్ణాట‌క ఎన్నిక‌ల వెన‌క ఎవ‌రి కృషి ఉందో కాంగ్రెస్ గ‌మ‌నిస్తే బాగుంటుంద‌ని అభిప్రాయ‌ప‌డ్డారు.

“ఎన్నిక‌ల‌కు ముందు సోనియా(sonia gandhi) నాతో ఓ మాట అన్నారు. క‌ర్ణాట‌క‌లో నువ్వు మ‌నల్ని గెలిపించి తీర‌తావ్ అని. నేను కర్ణాక‌ట‌ను అంటిపెట్టుకుని ఉండి నా బాధ్య‌త‌ల‌ను స‌క్ర‌మంగా నిర్వ‌ర్తించాను. క‌నీసం అందుకైనా నాపై జాలి చూపాలి. నేను బ్లాక్‌మెయిల్ చేసే టైం కాదు. నేను చిన్న‌పిల్లాడిని కాను ట్రాప్‌లో ప‌డ‌టానికి. సిద్ధ‌రామయ్య‌కే అంద‌రు ఎమ్మెల్యేల స‌పోర్ట్ ఉంద‌ని అంటున్నారు. ఆయ‌న‌కు ఆల్ ది బెస్ట్ చెప్పాల‌నుకుంటున్నా” అని తెలిపారు