Telangana Elections: హైద‌రాబాద్‌లో త‌క్కువ శాతం పోలింగ్.. ఎక్కువ ఎక్క‌డో తెలుసా?

Telangana Elections: తెలంగాణ ఎన్నిక‌ల పోలింగ్ శాతం రాజ‌ధాని హైద‌రాబాద్‌లో (hyderabad) మ‌రీ త‌క్కువ‌గా ఉండ‌టం గ‌మ‌నార్హం. ఇప్ప‌టివర‌కు హైద‌రాబాద్‌లో న‌మోదైన పోలింగ్ శాతం 31.17. ఎక్కువ‌గా న‌మోదైన ప్రాంతం మెద‌క్ (medak) జిల్లా. అక్క‌డ పోలింగ్ శాతం ఇప్ప‌టివ‌ర‌కు 69.33. గ్రామీణ ప్రాంతాల్లోనే పోలింగ్ శాతం ఎక్కువ‌గా ఉంది. ప‌ట్ట‌ణ ప్రాంతాల్లో పోలింగ్ శాతం త‌క్కువ‌గా ఉండ‌టాన్ని చూస్తే ఎక్కువ‌గా చ‌దువుకున్న‌వారే ఓట్ల‌కు దూరంగా ఉంటున్న‌ట్లు తెలుస్తోంది.

ఇక నియోజ‌క‌వ‌ర్గంగా చూసుకుంటే దుబ్బాక‌లో అత్య‌ధికంగా పోలింగ్ శాతం న‌మోదైంది. దుబ్బాక‌లో 3 గంట‌ల వ‌ర‌కు న‌మోదైన పోలింగ్ శాతం 70.48. ఇక అత్యంత త‌క్కువ‌గా న‌మోదైన నియోజ‌క‌వ‌ర్గంగా యాకుత్‌పురా ఉంది. ఇక్క‌డ కేవ‌లం 20.09 శాత‌మే పోలింగ్ నమోదైంది. మావోయిస్టులు ఎక్కువ‌గా ఉండే 13 నియోజ‌క‌వ‌ర్గాల్లో 4 గంట‌ల‌కే పోలింగ్ ముగిసింది. మిగ‌తా నియోజ‌క‌వ‌ర్గాల్లో 5 గంట‌ల‌కు పోలింగ్ ముగియ‌నుంది.

ఈ 5 జిల్లాల్లో అత్య‌ధిక‌ పోలింగ్

మెద‌క్- 69.33 %
ములుగు- 67.84%
సిద్ధిపేట‌- 64.91 %
గ‌ద్వాల్- 64.45 %
మ‌హ‌బూబాబాద్- 65.05 %

ఈ 5 నియోజ‌క‌వ‌ర్గాల్లో అత్య‌ధిక పోలింగ్

దుబ్బాక‌- 70.48 %
మెద‌క్- 69.42 %
న‌ర్సాపూర్- 69.24 %
మంథ‌ని- 68.15 %
ములుగు- 67.84 %