Election Special: ఈ దేశాల్లో ఎన్నికలు ఎలా జరుగుతాయో తెలుసా?
Election Special: భారతదేశంలో ఐదు రాష్ట్రాల్లో ఎన్నికలు జరుగుతున్నాయి. మధ్యప్రదేశ్, మిజోరాం, రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్, తెలంగాణ. ఈ నెల 30న తెలంగాణలో ఓటింగ్ ప్రారంభం అవుతుంది. భారత్‌లో ఎన్నికలు జరిగినట్లు మరే దేశంలోనూ జరగవు. మరి ఇతర దేశాల్లో ఎన్నికలు ఎలా జరుగుతాయో తెలుసుకుందాం.
అగ్రరాజ్యం అమెరికాలో (america) ప్రతి ఐదేళ్లకు ఒకసారి అధ్యక్ష ఎన్నికలు జరుగుతాయి. అది కూడా మంగళవారం నాడే ఓటర్లు ఓటు హక్కును వినియోగించుకుంటారు. దాదాపు ఇంగ్లీష్ ప్రధాన భాష అయిన అన్ని దేశాల్లో దాదాపు ఎన్నికలు ఆదివారం నాడే జరుగుతాయి. కెనడాలో (canada) మంగళవారం, బ్రిటన్‌లో (britain) గురువారం నాడు ఓటింగ్ జరుగుతుంది. ఇక ఆస్ట్రేలియా (australia), న్యూజిలాండ్ (newzealand) దేశాల్లో శనివారం ఓటింగ్ ప్రక్రియ జరుగుతుంది. అమెరికాలో ఓటర్ల శాతం పెరిగింది కానీ అభివృద్ధి చెందిన ఇతర దేశాలతో పోలిస్తే అమెరికా ఓట్ల శాతం చాలా తక్కువ. (election special)
ఇక స్వీడెన్ (sweden), ఫ్రాన్స్ (france) దేశాల్లో లైన్‌లో నిలబడి ఓటు వేయాల్సిన పనిలేదు. ట్యాక్స్ రిజిస్టర్ల ద్వారా ఎవరెవరు ఓటు వేసేందుకు అర్హులో వారి ఓట్లను ఆటోమేటిక్‌గా రిజిస్టర్ చేసేస్తారు. అయితే ఎవరికి ఓటు వేయాలనుకుంటున్నారో ఓ సర్వే ద్వారా వివరాలు సేకరిస్తారు.
ఇక ఆస్ట్రేలియాలో (australia) రూల్ వేరు. 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్క పౌరుడు ఓటు హక్కు వినియోగించుకోవాల్సిందే. ఒకవేళ ఓటు వేయకపోతే వారికి 20 ఆస్ట్రేలియన్ డాలర్ల జరిమానా విధిస్తారు. ఆ జరిమానా కూడా కట్టకుండా తప్పించుకుంటే మరింత కఠినమైన శిక్షలు వేస్తారు. (election special)
అన్ని దేశాల్లో ఓటు హక్కు వినియోగించుకోవడానికి ప్రతి పౌరుడికి 18 ఏళ్లు రావాలి. కానీ బ్రెజిల్‌లో (brazil) అలా కాదు. అక్కడ 16 ఏళ్లకే ఓటు హక్కు వచ్చేస్తుంది. ఈ దేశంలో కూడా ఓటు వేయకపోతే జరిమానా విధిస్తారు. ఆస్ట్రియా (austria), నికరాగ్వా (nicaragua), అర్జెంటినా (argentina) దేశాల్లో కూడా 16 ఏళ్లు నిండగానే ఓటు హక్కు వినియోగించుకోవాలి. ఎస్టోనియా (estonia) అనే దేశంలో ఓటర్లు ఆన్‌లైన్ ద్వారానే తమ ఓటు హక్కును వినియోగించుకుంటారు.
చిలీ (chile) దేశంలో 1930 వరకు మహిళలు ఓట్లు వేయడానికి అనుమతి ఉండేది కాదు. ఆ తర్వాత మహిళల ఓట్లు కూడా ముఖ్యం అని భావించిన ప్రభుత్వం ఈ తీరును మార్చింది. కాకపోతే 2012 వరకు మహిళలు, పురుషులు వేరు వేరుగా వెళ్లి తమ ఓటు హక్కు వినియోగించుకునేవారు. ఆ తర్వాత ఈ పద్ధతికి స్వస్తి పలికారు. (election special)
ఇక ఉత్తర కొరియాలో (north korea) అసలు ఎన్నికలు జరగవు. ఎందుకంటే ఇక్కడ కిమ్ జాంగ్ ఉన్ (kim jong un) నియంత పాలనే కొనసాగుతూ ఉంటుంది. ఎవరైనా కిమ్‌కి వ్యతిరేకంగా పోటీకి దిగినా వాడు చచ్చాడే. కిమ్ తర్వాత వారసులు అధ్యక్షులు అవుతూ ఉంటారు. ఒకవేళ ఎన్నికలు నామమాత్రంగా జరిగినా అందరూ కిమ్‌కి సపోర్ట్ చేస్తున్నట్లు మాత్రమే ఓటు వేయాలి.
గ్యాంబియా (gambia) అనే దేశంలో నిరక్షరాస్యత ఎక్కువ. వారికి సంతకాలు చేయడం రాదు. అందుకే ఓటు వేయడానికి వారు సరికొత్త విధానాన్ని అమలు చేస్తున్నారు. ఎవరైతే బరిలో ఉన్నారు వారికి కొన్ని రంగులు కేటాయిస్తారు. ఆ రంగుల పెయింట్ డబ్బాలను కొని వాటిపై పోటీ చేస్తున్నవారి ఫోటోలు ఉంటాయి. ఓటర్లు తమ మద్దతు ఎవరికి తెలపాలని అనుకుంటారో ఆ అభ్యర్ధికి చెందిన రంగు డబ్బాలో మార్బుల్స్ ముంచాలి.