Kavitha: తిహార్ జైల్లో తొలిరోజు ఎలా గడిచిందంటే…
Kavitha: ఢిల్లీ లిక్కర్ స్కాంలో భారత రాష్ట్ర సమితి ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను తిహార్ జైల్‌కు తరలించారు. ఢిల్లీ కోర్టు 14 రోజుల పాటు ఆమెకు జ్యుడిషియల్ రిమాండ్ విధించింది. అయితే తొలి రోజున కవిత జైల్లో పప్పు అన్నం తిని వారు ఇచ్చిన పరుపుపైనే నిద్రించారట. కవితో పాటు సెల్లో మరో ఇద్దరు మహిళా ఖైదీలు ఉన్నారు. తిహార్ జైలులోని ఆరో సంఖ్య సెల్లో కవితను ఉంచారు. ఈ సెల్‌ను కేవలం మహిళా ఖైదీలకు మాత్రమే కేటాయిస్తారు. కవితతో పాటు ఉన్న మరో ఇద్దరు మహిళా ఖైదీలకు పెట్టిన ఆహారాన్నే కవితకు పెట్టారని.. ఈరోజు ఉదయం ఆమె చాయ్ స్నాక్స్ తిన్నారని జైలు అధికారులు వెల్లడించారు. అయితే కవిత ఇది కావాలి అని ప్రత్యేక డిమాండ్స్ ఏమీ చేయలేదని పేర్కొన్నారు. ఇక కవిత పెట్టుకున్న బెయిల్ పిటిషన్‌ను ఏప్రిల్ 1కి వాయిదా వేసారు. కోర్టు ఇచ్చిన ఆర్డర్ ప్రకారం ఆమెకు ఇంటి భోజనం, దుప్పటి, చెప్పులు, దుస్తులు, మందులు, పెన్ను, పేపర్ అందించనట్లు వెల్లడించారు.