2 ఏళ్లలో 2 షాట్లు కొట్టిన BJP..!
Mumbai: రెండేళ్లలో రెండు సార్లు మహారాష్ట్ర ప్రభుత్వాన్ని ఆడేసుకుంది BJP. కొన్ని నెలల క్రితం శివసేనలో (shiv sena) అసమ్మతి నెలకొని ఏకనాథ్ శిందేతో పాటు కొందరు ఎమ్మెల్యేలు ఆ పార్టీ నుంచి బయటికి వచ్చేసారు. BJPతో చేతులు కలిపి మహారాష్ట్రలో ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసారు. ఇప్పుడు మహారాష్ట్రలో ఏకనాథ్ శిండే సీఎంగా ఉండగా.. డిప్యూటీ సీఎంగా BJP నేత దేవేంద్ర ఫడణవీస్ ఉన్నారు. ఇప్పుడు నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీలో (ncp) 24 ఏళ్లుగా బాబాయ్ శరద్ పవార్‌కు (sharad pawar) చేయూతగా నిలిచిన అజిత్ పవార్ (ajit pawar) ఉన్నట్టుండి మహారాష్ట్ర ప్రభుత్వంతో చేతులు కలిపారు. ఆయన ఎన్సీపీకి చెందిన కొందరు ఎమ్మెల్యేలతో మాట్లాడుకుని దాదాపు 25 మంది మద్దతుతో మహారాష్ట్ర డిప్యూటీ సీఎంగా ప్రమాణ స్వీకారం చేసారు. దాంతో అందరి ముందు శరద్ పవార్‌కు తల తీసేసినట్లైంది. అసలు ఏం జరిగింది సమస్య ఏంటి అన్న వివరాలేవీ అజిత్ శరద్ పవార్‌తో కానీ సుప్రియ సూలేతో కానీ చర్చించలేదు. NCP కార్యకలాపాలన్నీ శరద్ పవార్ సుప్రియ సూలేకి ఇవ్వడం అజిత్‌కు నచ్చలేదని అందుకే పార్టీని వీడి BJPతో చేతులు కలిపారని టాక్ వినిపిస్తోంది.