Amaravathi: R-5 ఇళ్ల నిర్మాణంపై ఏపీ హైకోర్టు స్టే
AP: అమరావతిలోని R-5 జోన్‌లో ఇళ్ల నిర్మాణంపై ఏపీ హైకోర్టు స్టే విధించింది. నిర్మాణాలను వెంటనే ఆపేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ ఉత్తర్వులు జారీచేసింది. (amaravathi) ఇది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని గట్టి ఎదురుదెబ్బ అనే చెప్పాలి. రాజధానిలో నివసించని ప్రజల కోసం అమరావతిలో (amaravathi) ఆర్-5 జోన్ ఏర్పాటుచేసారు. ఇందుకోసం 1402 ఎకరాలను గుంటూరు, ఎన్టీఆర్ జిల్లాల కలెక్టర్లకు బదిలీ చేస్తూ ఇచ్చిన జీవోలను సవాలు చేస్తూ రాజధాని ప్రాంత గ్రామాల రైతు సంక్షేమ సంఘాలు ఏపీ హైకోర్టులో పిటిషన్ వేసిన సంగతి తెలిసిందే.