Vangalapudi Anitha: నా కొడకా నిన్ను వదిలిపెట్టేది లేదు.. అనిత ర్యాంప్ వార్నింగ్
Vangalapudi Anitha: తెలుగు దేశం పార్టీ హోం మంత్రి వంగలపూడి అనిత మంత్రిగా బాధ్యతలు చేపట్టాక తొలి ప్రెస్ మీట్ నిర్వహించారు. వైఎస్సార్ కాంగ్రెస్‌కు చెందిన వర్రా రవీందర్ రెడ్డి అనే వ్యక్తి సోషల్ మీడియాలో ఖాతాలు క్రియేట్ చేసి తెలుగు దేశం మహిళా నేతలపై చెప్పలేని విధంగా అసభ్యకర పోస్ట్‌లు కామెంట్స్ పెడుతున్నాడని.. వాటిని ఇతరులకు షేర్ చేస్తున్నాడని అనిత ఆరోపించారు. రవీందర్ రెడ్డి పులివెందులలో జగన్ అండ చూసుకుని రెచ్చిపోతున్నాడని.. వాడిని అసలు వదిలిపెట్టేది లేదని వార్నింగ్ ఇచ్చారు.
“” రేయ్ వర్రా రవీందర్ రెడ్డి… నా కొడకా నిన్ను వదిలిపెట్టేది లేదు. జగన్ అండ చూసుకుని రెచ్చిపోతున్నావేమో. రోజులు ఒకేలా ఉండవు. నువ్వు వేసిన ప్రతి పోస్ట్‌కి పర్యావసనాలు ఎలా ఉంటాయో చూడు. అసలు నువ్వు మనిషికే పుట్టావా అని డౌట్‌గా ఉంది “” అంటూ రెచ్చిపోయారు.