Himanta Sarma: ఇప్పుడే రెండో పెళ్లి చేసుకోండి.. ఎన్నికల తర్వాత జైలుకే
Himanta Sarma: ఓ ముఖ్యమంత్రి మాట్లాడాల్సిన మాటలేనా ఇవి? ఎంత హిందువు అయితే మాత్రం ముస్లింల పట్ల ఇంత ద్వేషం ఎందుకు? ద్వేషం ఉన్నంత మాత్రాన గౌరవనీయ స్థాయిలో ఉండి ఇలాంటి వ్యాఖ్యలు చేయచ్చా? అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ చేసిన వ్యాఖ్యల పట్ల నెటిజన్లు వేస్తున్న ప్రశ్నలు ఇవి. ఆల్ ఇండియా యునైటెడ్ డెమోక్రటివ్ ఫ్రంట్ (AIUDF) అధినేత బద్రుద్దిన్ అజ్మల్‌ను ఉద్దేశిస్తూ హిమంత అసభ్యకర వ్యాఖ్యలు చేసారు. అజ్మల్ ఒకవేళ రెండు, లేదా మూడో పెళ్లి చేసుకోవాలని లోక్ సభ ఎన్నికల తర్వాత పాలిగమీ బ్యాన్ చేయబడుతుంది కాబట్టి జైలుకు పంపిస్తామని హెచ్చరించారు. ముస్లిం మతంలో పాలిగమీ (వివిధ పెళ్లిళ్లు) సాధారణ అంశమే. కానీ CAA అమల్లోకి రాబోతోంది కాబట్టి ఇక పాలిగమీ చెల్లదు. దాంతో ఎన్ని పెళ్లిళ్లు చేసుకోవాలన్నా ఇప్పుడే చేసుకోండి అని హిమంత వ్యాఖ్యానించారు.