Himanta Biswa Sharma: ముస్లింల వల్లే కూరల రేట్లు పెరుగుతున్నాయట
Hyderabad: ముస్లింలు కూరగాయలు అమ్మడం వల్లే వాటి రేట్లు పెరుగుతున్నాయని అర్థంలేని వ్యాఖ్యలు చేసారు అస్సాం చీఫ్ మినిస్టర్ హిమంత విశ్వ శర్మ (himanta biswa sharma). అస్సాంలోని గువహాటిలో కూరగాయల రేట్లు ఎక్కువగా ఉండటంతో హిమంత ఇలా అన్నారు. కూరగాయలు అమ్ముతున్న ముస్లింలే కావాలని రేట్లు పెంచేస్తున్నారని ఆయన అన్నారు. అస్సాం ప్రజలు కూరగాయలు అమ్మే మాటైతే సాటి అస్సాం ప్రజలకు ఎక్కువ ధరలకు అమ్మరు. ఇక్కడ అస్సాంలో స్థిరపడిన మియాలు (బెంగాలీ ముస్లింలను మియా అంటారు) కావాలనే ఎక్కువ ధరలకు అమ్ముతున్నారు అని హిమంత అన్నారు.
దాంతో AIMIM అధినేత అసదుద్దీన్ ఒవైసీ (asaduddin owaisi) హిమంత వ్యాఖ్యలపై మండిపడ్డారు. ” ఓ వర్గానికి చెందిన ప్రజలు ఉన్నారు. వాళ్లు గేదె పాలు ఇవ్వకపోయినా, కోడి గుడ్లు పెట్టకపోయినా మియాల వల్లే అని ముస్లింలపై పడి ఏడుస్తుంటారు. నాకు తెలిసి వారి జీవితాలు ఇలా ఉండటానికి కూడా కారణం మియాలేనని అనుకుంటున్నారేమో” అని ట్వీట్ చేసారు.