Himanta Biswa Sarma: కృష్ణుడి పెళ్లిని లవ్ జిహాదీతో పోలుస్తూ…
Assam: అస్సాం ముఖ్యమంత్రి హిమంత విశ్వ శర్మ (himanta biswa sarma) ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అస్సాం ప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షుడు భూపేన్ కుమార్ బోరా (bupen kumar borah) శ్రీకృష్ణ పరమాత్ముడి గురించి రుక్మిణి గురించి మాట్లాడుతూ వారి బంధాన్ని లవ్ జిహాదీతో పోలుస్తూ చేసిన కామెంట్స్ చర్చనీయాంశంగా మారాయి. ఇలాంటి వ్యాఖ్యలు ఎవరు చేసినా ఊరుకునేది లేదని అరెస్ట్ చేయాల్సి ఉంటుందని హిమంత వార్నింగ్ ఇచ్చారు.
అస్సాంలోని గోలాఘాట్‌లో మూడు లవ్ జిహాద్‌కు సంబంధించిన హత్యలు జరిగాయి. దీనిపై భూపేన్ బోరా స్పందిస్తూ.. శ్రీకృష్ణుడు రుక్మిణిలది, దృతరాష్ట్రుడు గాంధారీలది కూడా లవ్ జిహాదీ ప్రేమే అని అన్నారు. ఇలాంటి సెన్సిటివ్ విషయాల్లోకి మహాభారతం లాంటి హిందూ పురాణాలను ఎందుకు తీసుకొస్తున్నారని మండిపడ్డారు. ఇప్పటివరకు భూపేన్పై ఎవ్వరూ కేసు పెట్టలేదని, ఎవరైనా కంప్లైంట్ ఇస్తే వెంటనే యాక్షన్ తీసుకునేలా చర్యలు తీసుకుంటానని తెలిపారు.