Vallabhaneni Vamsi: వంశీ ఇంటి వద్ద తీవ్ర ఉద్రికత్త
Vallabhaneni Vamsi: వైఎస్సార్ కాంగ్రెస్ నేత వల్లభనేని వంశీ ఇంటి వద్ద తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. తెలుగు దేశం పార్టీ శ్రేణులు ఒక్కసారిగా వంశీ ఇంటిపై విరుచుకుపడ్డారు. అధికారంలో ఉన్నంత కాలం చంద్రబాబు నాయుడు, నారా లోకేష్, భువనేశ్వరిలపై నోటి కొచ్చినట్లు వాగిన వంశీ.. ఈసారి మళ్లీ వైఎస్సార్ కాంగ్రెస్ అధికారంలోకి రాకపోతే రాజకీయ సన్యాసం తీసుకుంటానని సవాల్ విసిరారని.. మరి ఈరోజు ఆయన బయటికి వచ్చి సన్యాసం తీసుకుంటున్నట్లు ఎందుకు ప్రకటించడంలేదని హంగామా చేసారు. వంశీ ఇంట్లో లేరని చెప్తున్నా వినకుండా వాడు ఇంట్లోనే ఉన్నాడు బయటికి రమ్మనండి చూసుకుందాం అని రెచ్చిపోయారు. దాంతో పోలీసులు భారీగా వంశీ ఇంటి వద్ద మోహరించారు.