హ‌ర్యాణా ఎన్నిక‌ల ఫ‌లితాలతోనే చంద్ర‌బాబు మోసం తెలుస్తోంది

haryana elections results prove chandrababu naidu tampered evm

Vijaya Sai Reddy: హ‌ర్యాణా ఎన్నిక‌ల ఫ‌లితాల‌ను చూస్తుంటే ఆంధ్ర‌ప్ర‌దేశ్ ఎన్నిక‌ల్లో చంద్ర‌బాబు నాయుడు కూట‌మితో క‌లిసి ట్యాంప‌రింగ్‌కు పాల్ప‌డి మ‌రీ గెలిచార‌న్న విష‌యం స్ప‌ష్టం అవుతోంద‌ని అన్నారు వైఎస్సార్ కాంగ్రెస్ నేత విజ‌య‌సాయి రెడ్డి. హ‌ర్యాణా ఎన్నిక‌లు జ‌రిగిన నేప‌థ్యంలో నిన్న ఉద‌యం కౌంటింగ్ మొద‌ల‌వ‌గానే ముందు కాంగ్రెస్ పార్టీ ముందంజ‌లో ఉంది. దాంతో హ‌ర్యాణాలో గెలుపు కాంగ్రెస్‌దే అనుకుని స్థానిక కాంగ్రెస్ నేత‌లంతా డప్పులు కొట్టుకుంటూ మిఠాయిలు పంచుకుంటూ సెల‌బ్రేష‌న్స్ చేసుకున్నారు. మ‌ధ్యాహ్నానికి కాంగ్రెస్‌కు షాక్ త‌గిలింది. ఉన్నట్టుండి BJP పుంజుకుంది. చివ‌రికి హ‌ర్యాణాలో BJPనే హ్యాట్రిక్ విజ‌యం సాధించింది. ఇలా వ‌రుస‌గా మూడోసారి కూడా ఏ పార్టీ గెలిచింది లేదు. దాంతో ఈ ఫ‌లితాల‌ను తాము స్వీక‌రించ‌డంలేద‌ని క‌చ్చితంగా ఈవీఎం ట్యాంప‌రింగ్ జరిగిందంటూ కాంగ్రెస్ పార్టీ ఎన్నిక‌ల క‌మిష‌న్‌కి లేఖ రాసింది.

ఈ నేప‌థ్యంలో విజ‌య‌సాయి రెడ్డి ఆంధ్ర‌ప్ర‌దేశ్ ఎన్నిక‌ల్లోనూ అదే జ‌రిగిందని మ‌రోసారి ట్విట‌ర్ వేదిక‌గా ఆరోప‌ణ‌లు చేసారు. “” హర్యాణా ఎన్నికల ఫలితాల నేపథ్యంలో ఆంధ్ర ఎన్నికలకు సంబంధించి “ప్రపంచ బ్యాంకు జీతగాడు…చంద్రబాబు మోసగాడు”……అన్న కమ్యూనిస్టు పార్టీల పాత పాట గుర్తుకొస్తుంది. ఎలెక్షన్ కమిషన్ 3 నెలలు తర్వాత “ఫార్మ్ 20” వెబ్ సైట్ లో పెట్టింది . పోలింగ్ బూత్ వారీగా ఏ పార్టీకి ఎన్ని ఓట్లు వచ్చాయో చూసుకోవచ్చు. ఎన్నికలు ఫలితాలు వెలువతున్నప్పుడు ఆ తర్వాత మొదటి రెండు వారాలు ఎవరూ కోర్టుకి వెళ్లకుండా ప్రజల్లో చర్చ జరగకుండా TDP గూండాలు అరాచకం చేసారు.

ఫారం 20 వివరాలు బయటకి రాగానే లడ్డు వ్యవహారం వాళ్ళ కుట్రలో భాగంగా పక్కా స్కెచ్ తో మొదలెట్టారు. చంద్రబాబుకు నిజానిజాలతో పనిలేదు. ఇది నెయ్యికోసమో భగవంతుడి కోసమో మొదలెట్టింది కాదు. ఈవీఎం మోసాలని కప్పిపెట్టటానికి మొదలెట్టిన అరాచకం. చంద్రబాబు సరిగ్గా గుజరాత్ వెళ్లి వచ్చిన 6 రోజుల తర్వాత కుట్రలో భాగంగానే ఈ తప్పుడు రిపోర్ట్ ని ముందుగా గుజరాత్ నుండి తెప్పించి పెట్టుకుని TTDకి పాలకమండలి వేయకుండా తాత్సారం చేస్తూ వచ్చాడు. ప్రజలెవ్వరూ .. బూత్ వారీ లెక్కలు గురించి మాట్లాడుకోకుండా లడ్డు దీక్షలు చేప‌ట్టారు. ఇదీ స్థూలంగా జరుగుతున్న కుట్ర. ఉదాహరణకు హిందూపురం ఒక

వార్డులో వచ్చిన ఓట్లు ( ఎన్నికల కమిషన్ వెబ్సైట్లో పెట్టారు )

అసెంబ్లీ ఓట్లు

వైస్సార్సీపీ – 1
టీడీపీ – 95
బీఎస్పీ – 5
కాంగ్రెస్ – 464

అదే వార్డులో పార్లమెంట్ ఓట్లు

వైస్సార్సీపీ – 472
కాంగ్రెస్ – 1
టీడీపీ – 8
బీఎస్పీ – 83

ఇది సాధ్యమా ? ఇలా ఆంధ్రాఅంతా ఈవీఎంల ట్యాంప‌రింగే. దేశం మొత్తం మీద మొదటి నాలుగు దశల పోలింగులో BJPకి ఎదురుగాలి వీచిందని స్పష్టంగా అర్థమైంది . రిజల్ట్స్ కూడా అలాగే వచ్చాయి . కానీ అయిదు ఆరు దశలలో జరిగిన రాష్ట్రాలలో ముఖ్యంగా అసెంబ్లీకి పార్లమెంట్ కి కలిపి జరిగిన ఆంధ్రా లో ఈవీఎంలు ట్యాంప‌రింగ్ చేసారు. ఇది చంద్రబాబు, లోకేష్, హరిప్రసాద్, టెర్రాసొఫ్ట్ మరి కొంతమంది కలిసి చేసిన కుట్ర. ఎన్నికల ముందు చంద్రబాబు జర్మనీ, దుబాయ్, లోకేష్ ఇటలీ, జర్మనీ, దుబాయ్ ప్రయాణాలు ఈ ఈవీఎంల టాంపరింగ్ మరియు డబ్బులు బదిలీ కోసమే అన్నది సుస్పష్టం. చంద్రబాబు కు లోకేష్ కు హిందూమతం ఫై కానీ, భగవంతుడి ఫై కానీ నమ్మకంలేదు. వారి కులమే ఒక మతం అని నమ్మే వ్యక్తులు. చంద్రబాబు ఈ మోసాలు వెన్నతో పెట్టిన విద్య. అందరూ కలిసి ఈ అరాచకానికి తెరదీశారు .ప్రజాస్వామ్యం ఖూనీ అవుతూ ఉంది. రాష్ట్రాన్ని నాశనం చేస్తుంది ఈ దోపిడీ దొంగల TDP“” అని మండిప‌డ్డారు విజ‌య‌సాయి రెడ్డి.