Harish Rao: ఈ వ‌య‌సులో చంద్ర‌బాబు అరెస్ట్ మంచిదికాదు

TDP అధినేత చంద్ర‌బాబు నాయుడిని (chandrababu naidu) అరెస్ట్ చేయ‌డం దుర‌దృష్ట‌క‌రం అని అన్నారు BRS మంత్రి హ‌రీష్ రావు (harish rao). ఈ వ‌య‌సులో ఆయ‌న్ను అరెస్ట్ చేయ‌డం మంచిది కాద‌ని.. గ‌తంలో ఆయ‌న తెలంగాణ గురించి ఎంతో గొప్ప‌గా చెప్పిన వ్య‌క్త‌ని అన్నారు. తెలంగాణ‌లో ఎక‌రం అమ్మితే ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో 100 ఎక‌రాలు కొనుక్కోవచ్చ‌ని.. విభ‌జ‌న త‌ర్వాత తెలంగాణ అంత బాగా అభివృద్ధి చెందుతుంటే.. ఏపీ మాత్రం ఇంకా వెన‌క‌బడిపోతోంద‌ని చంద్ర‌బాబు చెప్పిన మాట‌ల‌ను గుర్తుచేస్తూ ఆయ‌న్ను అరెస్ట్ చేయ‌డం ప‌ట్ల అసంతృప్తి వ్య‌క్తం చేసారు.