Harish Rao: పొలిటికల్ టూరిస్ట్‌లకు ఏం తెలుసు?
తెలంగాణ ఎన్నికలు (telangana elections) దగ్గరపడుతున్న నేపథ్యంలో ఇతర పార్టీల వారు రాష్ట్రంలో అడుగుపెట్టి నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారని అన్నారు BRS మంత్రి హరీష్ రావు (harish rao). ఎన్నికల ముందు మాత్రమే వచ్చి లోకల్ స్క్రిప్ట్ రాసిస్తే చదివి నాలుగు మాటలు అని పోయేవారు పొలిటికల్ టూరిస్ట్‌లని వారిని తెలంగాణ అభివృద్ధి గురించి తెలీక అలా వాగిపోతున్నారని అన్నారు. కేంద్ర మంత్రి అమిత్ షా (amit shah) సొంత రాష్ట్రమైన గుజరాత్‌లో కరెంట్ కోతలు ఎక్కువగా ఉన్నాయని అక్కడ గుడ్డి పాలనను సరిచేసుకోవడం తెలీదు కానీ కేసీఆర్‌పై ఆరోపణలు చేస్తే మంచిగా ఉండదని హెచ్చరించారు. ఒక రాష్ట్ర పాలనపై ఆరోపణలు చేసే ముందు తాము అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో అభివృద్ధి ఏ రేంజ్‌లో ఉందో తెలుసుకుని అప్పుడు ఆరోపణలు చేస్తే ఓ అర్థం ఉంటుందని మండిపడ్డారు. (harish rao)