Kotha Prabhakar Reddy: దాడి చేసింది ఇతనే.. ఖండించిన హరీష్ రావు
Telangana Elections: మెదక్ ఎంపీ ,దుబ్బాక BRS అభ్యర్థి కొత్త ప్రభాకర్ రెడ్డిపై (kotha prabhakar reddy) హత్యాయత్నాన్ని మంత్రి హరీష్ రావు (harish rao) తీవ్రంగా ఖండించారు. ప్రభాకర్ రెడ్డిపై దాడి అత్యంత గర్హనీయం అని ప్రజాస్వామ్యంలో హింసకు తావు లేదని అన్నారు. ఈ ఘటనను ప్రభుత్వం, బీఆర్ఎస్ పార్టీ తీవ్రంగా పరిగణిస్తోందని తెలిపారు.
ప్రభాకర్ రెడ్డికి మెరుగైన చికిత్స అందించేందుకు సికింద్రాబాద్ యశోద ఆస్పత్రికి తరలించారు. ప్రభాకర్ రెడ్డికి కత్తిపోటుతో కడుపులో గాయాలయ్యాయి. ఆయన కుటుంబ సభ్యులు, బీఆర్ఎస్ కేడర్ ఎలాంటి ఆందోళనలకు గురికావద్దని.. ప్రభాకర్ రెడ్డిని కంటికి రెప్పలా కాపాడుకుంటామని హరీష్ రావు హామీ ఇచ్చారు. ప్రభాకర్ రెడ్డి మీద హత్యాయత్నంలో రాజకీయ కుట్ర ఏదైనా ఉందా అనే కోణంలో సమగ్ర దర్యాప్తు జరిపిస్తామని తెలిపారు.