Harish Rao: HYDRAA ఆఫీస్ నాలా కిందే ఉంది.. కూల్చేయండి

harish rao alleges hydraa office itself is under buddha statue

Harish Rao:  చెరువుల‌ను ఆక్ర‌మించి నిర్మాణాలు చేప‌డుతున్నారంటూ వ‌రుస‌గా కట్ట‌డాల‌ను కూల్చేస్తున్న హైడ్రా (HYDRAA) సంస్థ‌పై భార‌త రాష్ట్ర స‌మితి (BRS) నేత హ‌రీష్ రావు షాకింగ్ కామెంట్స్ చేసారు. చెరువుల‌ను ఆక్ర‌మించారు అని గొంతు చించుకున్న‌ హైడ్రా సంస్థ‌ ఆఫీసే బుద్ధ భవన్ నాలా కింద ఉందంటూ ఆయ‌న ఆరోప‌ణ‌లు చేసారు. అందరికీ ఒకే రూల్ కాబ‌ట్టి హైడ్రా ఆఫీస్‌ను కూల్చేయాల‌ని డిమాండ్ చేసారు. నెక్లెస్ రోడ్డులోని ప్రైవేట్, కమర్షియల్ షాపులు, తదితర వాణిజ్య భవనాలు హుస్సేన్ సాగర్ FTL పరిధిలో ఉన్నాయని వాటిని కూలగొడతారా? అని ప్ర‌శ్నించారు. కొందరివి డైరెక్ట్‌గా కూలగొట్టి, మరికొందరికి నోటీసులిచ్చి టైం ఇస్తున్నారా? అని మండిప‌డ్డారు.