EXCLUSIVE: అడ్రెస్ లేని పార్టీకి ష‌ర్మిళ అధ్య‌క్షురాలైతే ఏంటి?

EXCLUSIVE: ఏపీ కాంగ్రెస్ క‌మిటీ అధ్య‌క్షురాలిగా వైఎస్ ష‌ర్మిళ (ys sharmila) అధ్య‌క్షురాలు అవ‌డంపై మంత్రి గుడివాడ అమ‌ర్నాథ్ (gudivada amarnath) షాకింగ్ కామెంట్స్ చేసారు. కాంగ్రెస్ అనేది ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో అడ్రెస్ లేని పార్టీ అని.. అలాంటి పార్టీకి రాష్ట్ర అధ్య‌క్షురాలిగా ష‌ర్మిళ‌ను నియ‌మిస్తే ఏంటి నియ‌మించ‌క‌పోతే ఏంటి అని అమ‌ర్నాథ్ అన్నారు. వ‌చ్చే ఎన్నిక‌ల్లో టికెట్ వ‌స్తుందా రాదా అనే అంశంపై మాట్లాడుతూ.. త‌న‌కు లేని బాధ మీడియా వారికి ఎందుకు అని అడిగేసారు. పార్టీ టికెట్ ఇస్తే పోటీ చేస్తాం లేదంటే పార్టీ కోసం ప‌నిచేస్తామ‌ని అన్నారు.