Gudivada Amarnath: రుషికొండపై భవనాలు చూపించేసారు.. రేపు ప్రధాని వస్తే ఉండాల్సింది అక్కడే
అవన్నీ రేపు రాష్ట్రానికి ఎవరైనా ముఖ్య అతిథులు వస్తే ఉండేందుకు నిర్మించినవని.. ప్రధాని కానీ రాష్ట్రపతి కానీ ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు కానీ ఇలా ఎవరైనా పెద్ద వాళ్లు వస్తే అక్కడ నివసించేందుకు వీలుగా కట్టించాం కానీ జగన్ నివసించేందుకు కట్టించినవి కాదని అమర్నాథ్ అన్నారు. ఇలా భవనాల లోపల ఏమున్నాయో చూపించేస్తే రేపు ప్రధాని కానీ ఇంకెవరైనా వీఐపీ కానీ వస్తే వారికి భద్రతా లోపాలు ఉండవా అని ప్రశ్నించారు.
భవనాల లోపల ఏమున్నాయో చూపించినట్లే.. తమ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు తాము చేసిన మంచి పనులను కూడా చూపించాల్సిందని.. రుషికొండ ఎదురుగా ఉన్న గీతం కాలేజ్‌లో జరిగిన అక్రమ కట్టడాలను కూడా చూపించాల్సిందని అమర్నాథ్ అభిప్రాయపడ్డారు.