Gudivada Amarnath: “ప‌వ‌న్ అత్తారింటికి దారేది.. ఏ దారిలో వెళ్తారు?”

Gudivada Amarnath: ప‌వ‌న్ క‌ళ్యాణ్ (pawan kalyan) మాట్లాడితే అత్తారింటికి దారేది అంటున్నార‌ని.. ఆయ‌న‌కు మూడు దారులున్నా ఇప్పుడు నాలుగో దారి కోసం వెతుకుతున్నాడ‌ని విమర్శించారు ఏపీ ఐటీ శాఖ మంత్రి గుడివాడ అమ‌ర్నాథ్. ప‌వ‌న్ స‌భ‌లు పెట్టి ప‌స లేని మాట‌లు మాట్లాడుతున్నార‌ని.. జ‌గ‌న్ ఏపీలో ఇస్తున్నన్ని సంక్షేమ ప‌థ‌కాలు ఈ దేశంలో ఏ రాష్ట్రం కూడా ఇవ్వడంలేద‌ని తెలిపారు.