Gudivada Amarnath: షర్మిళపై కామెంట్.. తెలిసన్నాడా తెలీకన్నాడా?
Gudivada Amarnath: YSRCP మంత్రి గుడివాడ అమర్నాథ్.. YSRTP అధ్యక్షురాలు వైఎస్ షర్మిళపై (ys sharmila) కామెంట్ చేసారు. ఆమెకు త్వరలో కాంగ్రెస్ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షురాలి పదవి ఇవ్వనుందని వార్తలు వెలువడుతున్న నేపథ్యంలో అమర్నాథ్ స్పందించారు. షర్మిళ కాంగ్రెస్లో చేరినా కేఏ పాల్ పార్టీలో చేరినా తమకు ఒరిగింది ఏమీ లేదని అన్నారు.
అసలు ఈ మాట అమర్నాథ్ తెలిసన్నారో తెలీకన్నారో ఆయనకే తెలియాలి. ఏపీలో చెల్లెలు అడుగుపెట్టబోతోందని తెలిసినప్పటి నుంచి సీఎం జగన్ మోహన్ రెడ్డి గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయ్. ఎక్కడ చెల్లెలు తన గెలుపుకు అడ్డు పడుతుందో అని ఇప్పటినుంచే ప్రణాళికలు రచిస్తున్నారు. చెల్లెలిని తప్పుకోవాలని మెల్లిగా నచ్చజెప్పేందుకే కొంతకాలంగా దూరం పెట్టిన తల్లిని మొన్న క్రిస్మస్ రోజు కలిసారు. అలాంటి సమయంలో సొంత పార్టీకి చెందిన నేత చెల్లెలిపై కామెంట్ చేస్తూ రెచ్చగొడితే జగన్ ఊరుకుంటాడా?
ఎన్నికల్లో తన గెలుపునకు చెల్లెలు ఎక్కడ అడ్డం పడుతుందో అని కాస్త భయాందోళనకు గురవుతున్న జగన్.. ఎలాగోలా ఆమెను తనవైపునకు తిప్పుకోవాలని చూస్తున్నారు. ఈ విషయం తెలీక సొంత పార్టీ నేతలే షర్మిళపై కామెంట్స్ చేసి ఆమెను రెచ్చగొట్టే విధంగా చేస్తే వారికే నష్టం అని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.