Gudivada Amarnath: డిక్కీ బల్సిన కోడి చికెన్ షాప్ ముందు తొడకొట్టిందట
AP: డిక్కీ బలిసిన కోడి చికెన్ షాప్ ముందు తొడకొట్టిందంటూ మళ్లీ బూతు పురాణం మొదలుపెట్టారు YSRCP ఎమ్మెల్యే గుడివాడ అమర్నాథ్ (gudivada amarnath). నిన్న వారాహి యాత్రలో భాగంగా జనసేనాని పవన్ కళ్యాణ్ (janasena pawan kalyan) జగన్ సర్కార్‌పై ఆరోపణలు చేయడంతో ఆయనకు సెటైర్ వేయడానికి అమర్నాథ్ రెడీ అయిపోయారు. జగన్‌కు సవాలు విసరడం అంటే డిక్కీ బలిసిన కోడి చికెన్ షాప్ ముందు తొడ కొట్టడమే అంటూ సినిమా డైలాగులు చెప్పారు. పవన్ కళ్యాణ్ (pawan kalyan) ఒక్క సీటు కూడా గెలవలేని స్థితిలో ఉన్నారని కమెడియన్లు, క్యారెక్టర్ ఆర్టిస్టులు ఎంపీలు, ఎమ్మెల్యే అయ్యారు కానీ పవన్ ఎందుకు కాలేకపోయారు అని ప్రశ్నించారు.