Govinda: రాజ‌కీయ వ‌న‌వాసానికి స్వ‌స్తి ప‌లికిన న‌టుడు

Govinda: ప్ర‌ముఖ బాలీవుడ్ న‌టుడు గోవింద 14 ఏళ్ల రాజ‌కీయ వ‌న‌వాసానికి స్వ‌స్తి పలికారు. ఒక‌ప్పుడు బాలీవుడ్‌లో అగ్ర హీరోల్లో ఒక‌రిగా ఉన్న గోవింద 2004లో రాజకీయాల్లోకి బ్లాక్ బ‌స్ట‌ర్ ఎంట్రీ ఇచ్చారు. అప్పట్లో కాంగ్రెస్‌లో చేరిన గోవింద.. భార‌తీయ జ‌న‌తా పార్టీ నేత రామ్ నాయ‌క్‌ను ఉత్త‌ర ముంబై లోక్ స‌భ స్థానంలో ఓడించారు. 2004 నుంచి 2009 వ‌ర‌కు రాజ‌కీయాల్లో ఉన్న గోవింద ఆ త‌ర్వాత పార్టీకి రాజీనామా చేసారు. దాదాపు 14 ఏళ్ల త‌ర్వాత ఇప్పుడు ఆయ‌న మ‌ళ్లీ రాజ‌కీయాల్లోకి అడుగుపెట్టారు. శివ‌సేన‌లో చేరారు. తాను మ‌ళ్లీ రాజ‌కీయాల్లోకి వ‌స్తాన‌ని అనుకోలేద‌ని తెలిపారు.

అయితే ఎన్నిక‌లు ద‌గ్గ‌ర‌పడుతున్న స‌మ‌యంలో టికెట్ ఆశిస్తూ ఆయ‌న పార్టీలో చేరారా అనే అంశంపై మ‌హారాష్ట్ర ముఖ్య‌మంత్రి ఏక్‌నాథ్ శిందే స్పందించారు. ఆయ‌న పార్టీలో చేర‌డానికి ఇప్పుడు జ‌ర‌గ‌బోయే ఎన్నిక‌ల‌కు ఏం సంబంధం లేద‌ని.. ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోదీ చేస్తున్న అభివృద్ధిని చూసి సినిమా రంగానికి ఏద‌న్నా చేయాల‌న్న ఉద్దేశంతో ఆయ‌న పార్టీలో చేరార‌ని తెలిపారు.