BRS నన్ను పిలవలేదు.. ఇప్పుడు మొసలి కన్నీరు దేనికి?
Hyderabad: BRSపై మండిపడ్డారు గవర్నర్ తమిళిసై (tamilisai). కొత్త పార్లమెంట్ ప్రారంభోత్సవానికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ముని పిలవకపోవడంపై ప్రధాని నరేంద్ర మోదీపై (modi), బీజేపీపై BRS ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇదేం రాజ్యాంగ నీతి అని ప్రశ్నించింది. ఈ విషయంపై తెలంగాణ గవర్నర్ తమిళిసై (governor tamilisai) స్పందించారు. “బీజేపీకి రాజ్యాంగ నీతి లేదా అని ఈరోజు బీఆర్ఎస్ ప్రశ్నిస్తోంది. మరి కొత్త తెలంగాణ సెక్రటేరియట్ ప్రారంభోత్సవానికి గవర్నర్‌గా నాకు ఆహ్వానం అందలేదు. అప్పుడు గుర్తుకు రాని రాజ్యాంగ నీతి ఇప్పుడు గుర్తుకొచ్చిందా? ఈ మొసలి కన్నీరు ఇప్పుడెందుకు” అని మండిపడ్డారు. ఆదివారం దిల్లీలో కొత్త పార్లమెంట్‌ను మోదీ ప్రారంభించబోతున్నారు. అసలైతే పార్లమెంట్ ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని రాష్ట్రపతి చేతుల మీదుగా జరిపించాలి. కానీ మోదీ రాష్ట్రపతిని కనీసం ఆహ్వానించకుండా ఆయనే ప్రారంభించేస్తున్నారు. దాంతో దాదాపు 19 మంది ప్రతిపక్ష పార్టీలు ఈ వేడుకకు రాబోమని తేల్చి చెప్పేసాయి. ఈ విషయంపై ఇప్పటికే సుప్రీంకోర్టులో పిటిషన్ కూడా దాఖలైంది.