Padi Kaushik Reddy: BRS ఎమ్మెల్యేపై గవర్నర్ ఫైర్
Padi Kaushik Reddy: BRS ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిపై తెలంగాణ గవర్నర్ తమిళిసై (tamilisai) ఫైర్ అయ్యారు. జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో తమిళిసై ఈ వ్యాఖ్యలు చేసారు. తెలంగాణ ఎన్నికల సమయంలో ప్రచారం చేస్తుండగా కౌశిక్ రెడ్డి.. తనకు ఓట్లు వేసి గెలిపించకపోతే కుటుంబం అంతా ఆత్మహత్యకు పాల్పడతామని బెదిరించడం వివాదాస్పదంగా మారింది. దీనిపై తమిళిసై స్పందించారు. అలా బలవన్మరణానికి పాల్పడతానని కౌశిక్ రెడ్డి అనడం సరికాదని తమిళిసై మండిపడ్డారు. ఓటర్లను ఎవ్వరూ కూడా బలవంతపెట్టకూడదని అది క్షమించరాని నేరం అని అన్నారు. ఆయనపై చర్యలు తీసుకోవాలని తమిళిసై ఆదేశాలు జారీ చేసారు.