TSRTC Bill: అడ్డుపడుతున్న గవర్నర్.. RTC బంద్
Hyderabad: TSRTC బిల్లును (tsrtc bill) తెలంగాణ ప్రభుత్వంలో విలీనం చేయడంపై గవర్నర్ తమిళిసై (tamilisai) అడ్డుపడుతున్నారు. సీఎం KCR బిల్లును పాస్ చేసినప్పటికీ గవర్నర్ ఆమోదం తెలిపితేనే అది అమల్లోకి వస్తుంది. కానీ తమిళిసై బిల్లుకి ఇంకా ఆమోదం తెలపలేదు. ఎందుకు విలీనం చేయాలని అనుకుంటున్నారో క్లియర్‌గా రాసి ఇవ్వాలని ఆదేశాలు జారీ చేసారు. దాంతో తమిళిసై పట్ల రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టీసీ సిబ్బంది బంద్‌కు పిలుపునిచ్చారు. దాంతో బస్సులు డిపోలకే పరిమితం అయ్యాయి. ఈరోజు ఉదయం 6 గంటల నుండి 8 గంటల వరకు బస్సులు నిలిపివేయాలని ఆర్టీసీ ఉద్యోగుల నిర్ణయించారు. ఈరోజు ఉదయం 11 గంటలకు నెక్లెస్ రోడ్డుకు రావాలని పిలుపు. అటు నుండి రాజ్ భవన్ ముట్టడించే యోచనలో ఆర్టీసీ ఉద్యోగులు ఉన్నారు. (tsrtc bill)