Gottipati Lakshmi: అధికారం.. ఆపై అహంకారం

gottipati lakshmi hulchul in government hospital

Gottipati Lakshmi: అధికారం వ‌చ్చింది.. ఆపై అహంకారం రొమ్ము విరిచింది. అలా ఉంది తెలుగు దేశం పార్టీకి చెందిన ప్ర‌కాశం జిల్లా ఇన్‌ఛార్జి గొట్టిపాటి ల‌క్ష్మి ప్ర‌వ‌ర్త‌న‌. ఆవిడ ఈరోజు ద‌ర్శిలోని ప్ర‌భుత్వ హాస్పిట‌ల్‌ను సంద‌ర్శించారు. హాస్పిట‌ల్‌ సూపరింటెండెంట్ కుర్చీలో కూర్చొని మరీ ఆదేశాలు జారీ చేస్తూ హ‌ల్‌చ‌ల్ చేసారు. దాంతో హాస్పిట‌ల్‌ సూపరింటెండెంట్‌ని అవమానించిందని సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్‌ అన్న కూతురే ఈ లక్ష్మి.