స్ట్రాంగ్ అభ్యర్ధి కావాలని కోరిన ఆ మహిళ ఎవరు..?
Telangana Elections: గోషామహల్ సీటులో ఎమ్మెల్యేగా BJP నేత రాజా సింగ్ (raja singh) ఉన్నారు. ఆయన ఖట్టర్ హిందూ. అందుకే BJP టికెట్ ఇవ్వకపోతే ఒంటరిగానైనా పోరాడతా కానీ మరో పార్టీలో చేరేది లేదన్నారు. అయితే ఈసారి ఆయన గెలుపు కాస్త అనుమానకరంగా ఉంది. ఎందుకంటే ఏడాది క్రితం ప్రముఖ ముస్లిం స్టాండప్ కమెడియన్ అయిన మునావర్ ఫారుఖీ పట్ల రాజా సింగ్ మత విద్వేషపూరిత వ్యాఖ్యలు చేసారు. దాంతో పార్టీ ఆయన సస్పెండ్ చేసింది. అయితే ఎన్నికలు దగ్గరపడుతున్న సమయంలో భారతీయ జనతా పార్టీ ఆయన సస్పెన్షన్‌ను తొలగించింది. గోషామహల్ టికెట్ కూడా మళ్లీ ఆయనకే కేటాయించింది.
అయితే ఇప్పుడు గోషామహల్లో మళ్లీ రాజా సింగే గెలిస్తే మరోసారి ఆయన ఇతర మతాలకు సంబంధించిన విద్వేషపూరిత వ్యాఖ్యలు చేస్తారని దీని వల్ల సమాజంలో మత కల్లోలాలకు దారితీసే ఘటనలు జరుగుతాయని గోషామహల్ వాసులు వాపోతున్నారు. మళ్లీ అక్కడ ఎమ్మెల్యేగా రాజా సింగ్ వద్దు అనుకుంటున్నవారు.. BRS పార్టీని, సీఎం KCRను స్ట్రాంగ్ అభ్యర్ధిని పెట్టించి మరీ రాజా సింగ్‌ని ఓడించాలని కోరుతున్నారు. అమూమత్ సొసైటీ ఫౌండర్ ఖలీదా పర్వీన్ ఈ మేరకు KCRకు ప్రత్యేక అభ్యర్ధన చేసారు. ఖలీదా పర్వీన్ సామాజిక కార్యకర్త. మత విద్వేషాలకు సంబంధించి ఏవైనా గొడవలు జరిగితే ఆమె వెంటనే రంగంలోకి దిగి తప్పు ఎవరివైపు ఉన్నా వారికి శిక్ష పడేలా చేస్తుంటారు.
ఆమె కూడా ముస్లిమే అయినప్పటికీ.. తమ మతం వారు హిందువులను ఏమన్నా కూడా ఊరుకోరు. అసలు మన తెలంగాణలో కులాల గొడవ ఉంది కానీ మతాల విషయంలో ఎలాంటి సమస్యా లేదు. హిందూ ముస్లిం క్రైస్తవులు కలిసి మెలిసే ఉంటారు. కానీ ఈ రాజా సింగ్ లాంటివారు విద్వేషపూరిత వ్యాఖ్యలు చేసి చిచ్చు పెట్టాలని చూస్తున్నారని గోషామహల్ వాసుల ఆవేదన. మతసామరస్యంతో ఉన్న తమలో ఇలాంటి విషాన్ని నింపాలని చూస్తోంది రాజా సింగేనని.. ఈసారి ఆయన రాకుండా KCR స్ట్రాంగ్ అభ్యర్ధిని నిలబెట్టి పోటీ చేయించాలని రిక్వెస్ట్ చేస్తున్నారు. ఇక BRS ఇప్పటివరకు గోషామహల్ అభ్యర్ధిని ప్రకటించలేదు. మాజీ ఎమ్మెల్యే ప్రేమ్ సింగ్ రాథోడ్‌ను బరిలోకి దింపే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.